సాధారణంగా సినిమాల్లో ఆర్మీ పాత్రలు చూస్తే మనకు గూస్ బంప్స్ పుడతాయి. అలాంటిది నిజ జీవితం లో ఆర్మీ లోకి వెళ్లి ప్రాణాలు అర్పించిన  వీరులు ఎందరో ఉన్నారు.. ఈ రీల్ హీరోల కంటే ఆ రియల్ హీరోలు ఎంతో గొప్ప అని చెప్పవచ్చు. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కన్నడ నటి రుక్మిణి వసంత్ తండ్రి వసంత్ వేణుగోపాల్.. ఈయన ఇండియన్ ఆర్మీలో పనిచేసి దేశం కోసం ప్రాణాలర్పించారు. అయితే ఈ విషయాన్ని హీరోయిన్ రుక్మిణి  తాజాగా ఒక ఇంటర్వ్యూ లో బయట పెట్టింది. రుక్మిణి వసంత్ అంటే చాలామంది ఒక హీరోయిన్ గా మాత్రమే గుర్తుపడతారు. కానీ ఈమె దేశం కోసం ప్రాణాలర్పించిన ఒక వీర జవాన్ కూతురని చాలామందికి తెలియదు..

 అయితే తన తండ్రి పేరు చిరస్థాయిగా నిలిచిపోయి ఉండాలని ఆమె తన పేరు ముందు వసంత్ అని యాడ్ చేసుకుంది. తన తండ్రి వేణుగోపాల్ 2007 లో పాకిస్తాన్ శత్రు దాడిలో మరణించారు.. జమ్ము కాశ్మీర్ ఉరి ప్రాంతంలో పాకిస్తాన్ కు చెందిన ఒక ట్రక్కు భారత భూభాగంలోకి చొచ్చుకొస్తుండడంతో దాన్ని గమనించిన వసంత్ టీం ఎదుర్కొంది. ఇందులో రుక్మిణి తండ్రి వసంత్ తన ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా మన భూభాగంలోకి వచ్చిన పాకిస్తానీలను హతమార్చారు.

ఈ దాడిలో  వసంత్ కు  ఏడు బుల్లెట్లు తగిలాయి. అయినా పట్టు విడవని విక్రమార్కుడిలా వారందరినీ చంపేసేదాక ఆయన వెనక్కి తగ్గలేదు. చివరికి కొన ఊపిరితో ఆసుపత్రిలో కన్నుమూశారు. అయితే వసంత్ వేణుగోపాల్ మరణం తర్వాత  కర్ణాటక రాష్ట్రం ఆయనకు  అశోక చక్రా అనే బిరుదు అందించింది. ఈ విధంగా వసంత్ వేణుగోపాల్ ఇండియన్ ఆర్మీలో కీలకంగా వ్యవహరించి తన ప్రాణాలు పోగొట్టుకున్నారని ఆయన కూతురు రుక్మిణి వసంత్ తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టి ఎమోషనల్ అయింది..

మరింత సమాచారం తెలుసుకోండి: