సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ఫేస్‌బుక్ వ‌ర్చువ‌ల్ వ‌ర‌ల్డ్ మెటావ‌ర్స్ నిర్మాణం లో భాగంగా నిష్ణాతులైన ఇంజినీర్ల‌ను నియమించుకోబోతున్నట్లు తెలిపింది. రానున్న పది సంవత్సరాలలో కనీసం పదివేల మందిని యూరోపియన్ దేశాలలో నియమించుకోవాలను కుంటుంది. ఈ విషయాలను పేస్ బుక్ తన బ్లాగర్ లో తెలియపరచింది. దీని ప్రధాన లక్ష్యం షాపింగ్, ఆన్లైన్ గేమింగ్ , వర్కింగ్ లాంటివి ఈ వర్చువల్ గా జరపాలని చూస్తోంది. ఇందుకోసం నిష్ణాతులైన ఇంజినీర్ల‌ను నియమించుకోవడం కోసం వేట మొదలు పెట్టింది.



అయితే యురోపియ‌న్ యూనియ‌న్‌లో మాత్రమే వారు దొరుకుతారని భావిస్తోంది పేస్ బుక్ అభిప్రాయం వ్యక్తం చేస్తోంది . ఇట‌లీ, స్పెయిన్‌, పోలాండ్‌, నెద‌ర్లాండ్స్‌, జ‌ర్మ‌నీ, ఫ్రాన్స్‌, ఐర్లాండ్ లాంటి దేశాల్లో పేస్ బుక్  రిక్రూట్మెంట్ డ్రైవ్ చేప‌ట్ట‌నున్న‌ది.కానీ ఈ జాబితా లో బ్రిటన్ కు పేస్ బుక్ స్తానం కల్పించలేదు. గత జులాయి లో పేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ మెటావ‌ర్స్‌కు చెందిన ఊహాత్మ‌క ఐడియాను బయటపెట్టారు . అప్పటినుండి ఈ విషయమై పలు చర్చలు , స‌మావేశాలను నిర్వహించి ఈ ఫైనల్ డెసిషన్ కి వచ్చారు. త్రీడీ వాతావ‌ర‌ణంలో వర్కర్లు వ‌ర్చువ‌ల్ వ‌ర‌ల్డ్ మెటావ‌ర్స్ లో అనేక సమావేశాల్లో పాల్గొనే వీలు ఉంటుంది


మరింత సమాచారం తెలుసుకోండి: