ఈ రోజుల్లో చాలా మంది కూడా తెల్లజట్టు సమస్యతో బాగా ఇబ్బంది పడుతున్నారు. దీనికి కారణం పోషక ఆహార లోపమని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.అయితే ఈ తెల్ల జుట్టు సమస్య తగ్గడం కోసం చాలా మంది ఎక్కువగా ఖర్చు పెడుతుంటారు. అందుకోసం చాలా హానికరమైన ప్రొడెట్స్‌ను ఉపయోగిస్తుంటారు. దీని వల్ల జుట్టు సమస్యలు ఎక్కువగా తలెత్తుతాయి. అయితే ఎలాంటి ప్రొడెట్స్‌ వాడకుండా ఇంట్లోనే లభించే కొన్ని పదార్థాలతో మీ జుట్టు తెల్లగా మారకుండా చేసుకోవచ్చు.ఆయుర్వేద నిపుణులు ఈ హోం రెమెడీని వాడటం వల్ల మీరు తెల్ల జుట్టు సమస్యలతో మళ్లీ ఇబ్బందులు పడకుండా ఉంటారని చెబుతున్నారు.ముందుగా జామ ఆకులను తీసుకొని పేస్ట్‌గా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత గోరింటాకు పొడి వేసి కలుపుకోవాలి.అలాగే ఇందులోకి నిమ్మరసం వేసి బాగా కలిపి ఒక ఇనుప పాత్రలో ఏడెనిమిది రోజుల పాటు ఉంచుకోవాలి.అప్పుడు ఈ పేస్ట్ పూర్తిగా నల్లగా మారుతుంది.ఇది సహజంగా తయారు చేసి పేస్ట్‌ కాబట్టి ఎలాంటి సమస్యల బారిన పడాల్సి అవసరం ఉండదు.


మీరు తెల్ల జుట్టు సమస్య నుంచి చాలా ఈజీగా బయట పడవచ్చు.ఈ పేస్ట్‌ను మీ తలపై వెంట్రుకల మొదళ్ళ నుంచి కొన దాకా అప్లై చేసుకోవాలి. కొంత సమయం తర్వాత తల స్నానం చేయడానికి కుంకుడుకాయని వాడాలి. ఇలా చేయడం వల్ల తల వెంట్రుకలు ఈజీగా నల్లగా మారుతాయి.ఇంకా అంతేకాకుండా మీ జుట్టు శాశ్వతంగా నల్లబడుతుందని ఆయుర్వద నిపుణులు చెబుతున్నారు.ఈ టిప్ తో పాటు కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల తెల్లజుట్టుతో బాధపడాల్సిన పని లేదని ఆరోగ్య, ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మీ ఆహారంలో సలాడ్లు, మాంసం, పండ్లు ఇంకా ఆకు కూరలు తీసుకోవడం వల్ల తెల్ల జుట్టు సమస్య బారిన కూడా పడాల్సి అవసరం లేదు. తెల్ల జుట్టకు ఉల్లిపాయ చాలా బాగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇంకా దీంతో పాటు ఉసిరి పొడిని హెయిర్ డైలాగా చేసి వారానికోసారి వాడితే ఖచ్చితంగా ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: