ఇదెక్కడి మాస్ కాంబినేషన్ రా మావా అనుకుంటున్నారా? కాంబో నిజమే కానీ సినిమా కాదు. ఎవరు మీలో కోటీశ్వరులు గేమ్ షో కి మహేష్ గెస్ట్ గా వెళ్లబోతున్నారట. జెమినీలో ప్రసారం అవుతున్న ఈ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం కర్టెన్ రైజర్ లో రామ్ చరణ్ పాల్గొన్నారు, లేటెస్ట్ గా మరో ప్రోమో బయటకు రాగా అందులో బడా దర్శకులు రాజమౌళి, కొరటాల శివ పాల్గొన్నారు. ఇప్పుడు మహేష్ బాబు పాల్గొనే ఎపిసోడ్ ను ఈరోజు షూట్ చేయనున్నారని అంటున్నారు. అయితే ఎప్పుడు ప్రసారం చేస్తారన్న దాని మీద క్లారిటీ లేదు, ఎలాగో దసరా దగ్గర పడింది కాబట్టి ఆ మంచి రోజున టెలికాస్ట్ చేయచ్చేమో. బిగ్ బాస్, ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమాలు పోటా పోటీగా సాగుతున్న క్రమంలో టీఆర్పీలు పెంచుకోవడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. బిగ్ బాస్ లోకి కూడా నిన్న రామ్ చరణ్ అడుగుపెట్టాడు, మాస్ట్రో యూనిట్ ప్రమోషన్స్ చేసుకుని వెళ్ళింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: