మన దేశంలో రెండేళ్ళ క్రితం దిశా హత్య కేసు ఘటన ఏ రేంజ్ లో సంచలనం అయిందో మనం చూసాం. ఈ హత్యకేసుకి సంబంధించి అప్పట్లో సైబరాబాద్ సీపీ గా ఉన్న సజ్జనార్ చాలా చాకచక్యంగా వ్యవహరించారు. అయితే అనుకోని పరిస్థితిలో పోలీసులు నిందితులపై ఎన్కౌంటర్ కు దిగారు. ఇక ఈ ఘటనలో కీలకమైన ఎన్కౌంటర్ కి సంబంధించి... దిశ జ్యుడీషియల్ కమిషన్ దర్యాప్తు వేగవంతం చేసారు.

దిశ కమిషన్ ముందు నేడు శంషాబాద్ డీసీపీ, లారీ ఓనర్ శ్రీనివాస్ రెడ్డి హాజరు అవుతున్నారు. ఇప్పటికే అప్పటి సీపీ గా ఉన్నసజ్జనార్   ను రెండు రోజుల పాటు ప్రశ్నించిన కమిషన్... సజ్జనార్  ఇచ్చిన వాగ్మూలం ఆధారంగానే డీసీపీ ని నేడు ప్రశ్నించనుంది. ఎన్ కౌంటర్ గురైన బాధితుల వివరాలపై లారీ ఓనర్ శ్రీనివాస్ రెడ్డి ని ప్రశ్నించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: