ఇవాళ ఏపీలో స్కూళ్లు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో సీఎం జగన్‌ విద్యాకానుక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి విద్యార్థికీ దాదాపు రూ.2,400 విలువైన విద్యా కానుక కిట్లను జగన్ ప్రభుత్వం అందిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో స్కూళ్లు తెరిచి 6,7 నెలలైనప్పటికీ యూనిఫామ్‌ ఇవ్వలేదని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.

కనీసం పాఠ్యపుస్తకాలు కూడా అందించలేని దుస్థితి అప్పట్లో నెలకొందని వైసీపీ నేతలు అంటున్నారు. అంతే కాదు.. ఏ ఇతర వస్తువులు కూడా చంద్రబాబు హయాంలో ఇవ్వలేదు. అయితే జగన్ వచ్చాక ఆ పరిస్థితిని సమూలంగా మారిపోయింది. జగన్ ప్రభుత్వం పాఠశాలలు తెరిచిన రోజే 10 వస్తువులతో కూడిన జగనన్న విద్యా కానుక కిట్లను ఇస్తోంది. గత సర్కారు పెండింగ్‌లో పెట్టిన రూ.1,778 కోట్ల  ఫీజు రీయింబర్స్‌ బకాయిలను సైతం సీఎం జగన్‌ ప్రభుత్వమే చెల్లించిందట.  


మరింత సమాచారం తెలుసుకోండి: