భార్య భర్తల బంధం అంటే అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది. నమ్మకానికి చిరునామా. ఒకసారి దాంపత్య బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత ఒకరి పట్ల ఒకరు ఎంతో నమ్మకంతో ఉంటూ ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకునే కలిసిమెలిసి ఉండాల్సి ఉంటుంది. కష్టసుఖాల్లో తోడుగా ఉంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలి. కానీ నేటి రోజుల్లో భార్యాభర్తల మధ్య మాత్రం ఇలాంటి బంధం ఎక్కడా కనిపించడం లేదు. కష్ట సుఖాల్లో తోడు ఉంటానని ప్రమాణం చేసిన వారే చివరికి కట్టుకున్న వారిని దారుణంగా హతమార్చిన ఘటన వెలుగులోకి వస్తున్నాయి.


 ముఖ్యంగా అక్రమ సంబంధాల కారణంగా దారుణ హత్యలు వెలుగులోకి వస్తూ ఉంటే మరికొన్ని చోట్ల కట్టుకున్న కట్టుకున్న వారిపై  అనుమానం పెంచుకునీ సూటిపోటి మాటలతో వేదించడం చివరికి దారుణ హత్య చేయడం లాంటిది కూడా వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. ఇటీవలి కాలంలో అనుమానాలతో కాపురం చేస్తున్న భార్య భర్తలు ఎంతో మంది ఉన్నారు. చివరికీ చిన్నగా మొదలైన అనుమానం పెరిగి పెద్దదై భార్యభర్తల మధ్య దారుణమైన పరిస్థితులకు కారణం అవుతుంది. ఇక్కడ ఇలాంటి ఘటన వెలుగు చూసింది.


 భార్యపై అనుమానం పెంచుకున్నాడు భర్త. సూటిపోటి మాటలతో వేధిస్తూ ఉండేవాడు. అంతేకాదు తమ కూతురికి తన పోలికలు లేవని అనుమానం పెంచుకుని మరింత వేధించాడు. చివరికి  తల్లీబిడ్డలు ఇద్దరిని కూడా దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన తిరుపతిలో వెలుగుచూసింది..గురువా రాజు పల్లి ఎస్సీ కాలనీలో నివాసముంటున్న కుమార్ అనే వ్యక్తి పావని అనే యువతితో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. ఏడాది క్రితం వీరికి  కుమార్తె పుట్టింది. పుట్టిన పాపకి తన పోలికలు లేవని కుమార్ భార్యను అనుమానించడం ప్రారంభించాడు. ఇటీవల చేపలు పట్టేందుకు వెళ్దామని చెప్పి పావని, కూతురు అమృతం తీసుకొని తిరుపతి ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్న  కాలువ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ కర్రలతో దారుణంగా కొట్టి హత్య చేశాడు.. పావని కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: