ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోయింది. జీవనశైలిలో కూడా మార్పులు వచ్చాయి. దీంతో ఏదైనా కావాలి అంటే ఎక్కడకు వెళ్లాల్సిన పనిలేదు. అర చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లోనే దొరుకుతుంది. కూరగాయల దగ్గరనుంచి  మొదలు పెడితే ప్రతి వస్తువు కూడా ఆన్లైన్లో దొరుకుతుంది అన్న విషయం తెలిసిందే. ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తే ఇకఇంటి దగ్గరికి వచ్చి డెలివరీ అవుతుంది. దీంతో ఎంతో మంది ఆన్లైన్ వేదికగా కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇలా ఆన్లైన్ సర్వీసులు అందిస్తున్న వాటిలో ప్రస్తుతం నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది ఈ కామర్స్ సంస్థ అమెజాన్.


 ఎన్నో రోజుల నుంచి అటు తమ వినియోగదారులకు మెరుగైన సర్వీసులు అందిస్తూ వస్తోంది. తమ వినియోగదారులు ఆర్డర్ చేసిన ప్రతి వస్తువును కూడా  ఎంతో పకడ్బందీగా డెలివరీ చేస్తూ వస్తోంది. కాని గత కొన్ని రోజుల నుంచి మాత్రం అమెజాన్ చిక్కుల్లో పడుతుంది అని చెప్పాలి.  ఇన్ని రోజుల వరకు అన్ని రకాల వస్తువులను విక్రయించే అమెజాన్ ఇక ఇప్పుడు నిషేధిత డ్రగ్స్ కూడా విక్రయిస్తూ ఉండటం గమనార్హం. ఇటీవలే అమెజాన్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు అని ఆరోపణలతో ఇప్పటికే ఒక్క కేసు కూడా నమోదు కావడం హాట్ టాపిక్ గా మారిపోయింది.


 ఇక ఇప్పుడు అమెజాన్ కి సంబంధించి మరొక అంశం కూడా వెలుగులోకి వచ్చి చర్చనీయాంశంగా మారిపోయింది. అమెజాన్ ద్వారా ఆన్లైన్లో గంజాయి స్మగ్లింగ్ జరుగుతుంది  అన్న విషయం బయటపడింది. విశాఖపట్నం నుంచి మధ్యప్రదేశ్ కి అమెజాన్ వేదికగా గంజాయి సరఫరా జరుగుతుంది అన్న విషయం బయటపడింది. మధ్యప్రదేశ్లో దీనికి సంబంధించి కేసు నమోదైంది. శ్రీనివాస్ సహా అమెజాన్ స్టోర్ ఉద్యోగి వెంకటేష్ కలిసి.. కరివేపాకు పొడి, హెర్బల్ ప్రొడక్ట్స్ పేరుతో ఈ గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఇలా తప్పుడు సమాచారంతో అమెజాన్ లో వ్యాపారం చేస్తున్న వారి వల్ల సంస్థకు చెడ్డపేరు వచ్చే నష్టాలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: