దేశంలో జరిగిన ఓ దారుణ సంఘటనకు సంబందించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర రైల్వే స్టేషన్లో ఈ ప్రమాదం జరిగినట్టు చాలా స్పస్టంగా తెలుస్తోంది. అక్కడ ఓ లోకో పైలట్ వీడియో కాల్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరుకి భారీ మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది. దీంతో అక్కడ ఆగి ఉన్నటువంటి రైలు కాస్తా ప్లాట్‌ఫారంపైకి దూసుకెళ్లి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ కరెంట్ షాక్‌కు గురైనట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి వీడియో కూడా సోషల్ మీడియాలో వైరలవుతోంది. అందులో ఆ లోకపైలట్ వ్యవహరించిన బాధ్యతారాహిత్యమైన తీరుని మనం చూడవచ్చు. ఈ వీడియోని ఒకసారి పరిశీలిస్తే ఢిల్లీలోని షకుర్ బస్తీ నుంచి వచ్చినటువంటి ఎలెక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్(ఈఎంయూ) అనే రైలు మధుర జంక్షన్ స్టేషన్‌కు చేరుకొంది. అప్పటివరకు విధులు నిర్వహించిన లోకోపైలట్ రైలు ఆగిన అనంతరం కిందకు దిగాడు. దీంతో అంతలో సచిన్ అనే మరో లోకో పైలన్ విధులు నిర్వహించడానికి ఫోన్లో వీడియో కాల్ మాట్లాడుతూనే రైలులోకి ఎక్కడం జరిగింది.

ఇక ఆ వీడియో కాల్‌లో బిజీగా ఉన్న సచిన్.. తన భుజానికున్నటువంటి బ్యాగును తీసి అక్కడ ఉన్న ఇంజిన్ రాడ్ పైన పెట్టడం జరిగింది. అయితే ఆ బరువుకు ఇంజిన్ హ్యాండిల్ ముందుకు కదలింది. దీంతో ఆ రైలు ముందుకు దూసుకుపోయింది. ఇలా రైలు కదులుతున్న విషయాన్ని కూడా ఆ లోకోపైలట్ సచిన్ గమనించకుండా వీడియో కాల్‌లోనే నిమగ్నమవడం చాలా బాధాకరం. చూస్తుడంగానే.. ఆ రైలు ప్లాట్‌ఫామ పైకి దూసుకెళ్లి.. అక్కడ ఉన్నటువంటి ఓ కరెంటు స్తంభాన్ని బలంగా ఢీకొట్టడంతో ఓ మహిళ కరెంట్ షాక్‌కు గురైంది. దీంతో ఆమెను హుటాహుటీనా సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే రైలులోని ప్రయాణికులంతా దిగిపోవడం వలన పెను ప్రమాదం తప్పిందంటున్నారు అక్కడున్న ప్రయాణికులు. దీంతో వెంటనే స్పందించిన రైల్వే యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి సచిన్‌తో పాటు.. మరో నలుగురిని సస్పెండ్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: