తప్పు చేసి దొరికి పోవడం ఎందుకు ?  దానికి సానుభూతి కోరుకోవడం ఎందుకు ? అన్యాయం జరిగిపోతుందని గగ్గోలు పెట్టడం ఎందుకు ? ఇప్పుడు ఇవే ప్రశ్నలు తెలుగుదేశం పార్టీ విషయంలో వినిపిస్తున్నాయి. గత టీడీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలను జగన్ తవ్వి తీస్తున్నారు. వేల కోట్ల కుంభకోణాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అప్పట్లో ఈ కుంభకోణాల గురించి పెద్ద ఎత్తున రాద్దాంతం జరిగినా, ప్రజల్లో ఈ అవినీతి వ్యవహారాలపై పెద్ద ఎత్తున చర్చ జరిగినా  టిడిపి అధినేత, అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ఇవేమీ పట్టించుకోనట్టుగానే వ్యవహరించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నాయకులు విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, అవినీతి వ్యవహారాల్లో మునిగి తేలినా చంద్రబాబు ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నారు. 

 

IHG


నాయకులు ఆర్థికంగా బలపడితే పార్టీకి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో చంద్రబాబు చూస్తూ ఉండిపోయారు. దీంతో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుంది. ఆ ఫలితం ఎన్నికల సమయానికి కానీ బయటకి రాలేదు. తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా ఘోర ఓటమిని చవిచూసింది. దీనంతటికీ కారణం ఎవరు అనే ప్రశ్న మళ్లీ వేసుకుంటే అందరి చూపు చంద్రబాబు పైనే పడుతుంది. అప్పుడే ఆయన అవినీతి అక్రమాలను అడ్డుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు ప్రజల ముందు దోషిగా నిలబడే అవకాశం కూడా తప్పి ఉండేది. కానీ ఆ విధంగా బాబు చేయలేదు. గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో ఎప్పుడు వ్యవహరించిన తీరుకి విరుద్ధంగా 2014లో గెలిచిన తర్వాత చంద్రబాబు వ్యవహరించారు. 

 


పూర్తిగా పార్టీపై పట్టు కోల్పోయినట్టుగా ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ నాయకులు అందరినీ వారి ఇష్టానికి వదిలి వేయడంతో ఎన్నో అవినీతి అక్రమాలు మునిగితేలారు అనే ప్రచారం పెద్దఎత్తున జరిగింది. అప్పట్లో ఈ వ్యవహారాలపై పోరాటం చేసిన వైసీపీ, తాము అధికారంలోకి వస్తే టిడిపి ప్రభుత్వం లో నెలకొన్న అవినీతి అక్రమాలు తవ్వి తీస్తామని చెప్పింది. చెప్పినట్టుగానే ఇప్పుడు అన్ని వ్యవహారాలపైన, విచారణకు ఆదేశించి చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగానే మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈఎస్ఐ కుంభకోణంలో జైలుకు వెళ్లారు. మరో మాజీ మంత్రి ఇదే కేసులో జైలుకి వెళ్లేందుకు మరికొంతమంది సిద్ధంగా ఉన్నారు. వీరు కాకుండా మరో నలుగురైదుగురు ఇదే బాట పట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. 

IHG


ఇదిలా ఉంటే, ఇప్పుడు చంద్రబాబు తెలుగుదేశం పార్టీ వైసీపీ పై కక్షగట్టి,  బీసీలను వేధిస్తున్నారని చంద్రబాబు అరిచి గోల చేస్తున్నారు. కానీ ఈ విషయంలో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చేందుకు ఇతర పార్టీల నేతలెవ్వరూ బయటకు రావడం లేదు. పైగా అవినీతి వ్యవహారాలను తవ్వి తీస్తున్న వైసీపీని సమర్థిస్తూ వారు ప్రకటనలు చేస్తున్న తీరు చంద్రబాబుకు మరింత ఆవేదన కలిగిస్తోంది. నలుగురు మాజీ మంత్రులతో పాటు, తన కుమారుడు లోకేష్ కూడా జైలు బాట పట్టే అవకాశం ఉందనే ప్రచారంతో చంద్రబాబు మరింత ఆందోళన చెందుతున్నారు. బిజెపి, జనసేన, సిపిఎం ఇలా అన్ని పార్టీల నేతలు ఇప్పుడు టీడీపీ లో జరుగుతున్న పరిణామాలపై నోరు మెదిపేందుకు ఇష్టపడడంలేదు. ఈ పరిణామాలన్నీ  చంద్రబాబుకు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: