బానిస‌లంతా క‌ట్ట‌ప్ప‌లు.. భాగ్య శీలురు అంతా బాహుబ‌లి కి ప్ర‌తినిధులు.. ఆత్మ గౌర‌వం అధినాయ‌క‌త్వాన్ని నిల‌దీసే గుణం ఉన్న వారంతా నార‌ప్ప‌లు..ఇదీ బంగ‌రు తెలంగాణ‌లో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న క‌థ.. ఈ క‌థ‌కు మ‌లుపు ఎక్క‌డ ముగింపు ఎక్క‌డ అన్నది తేలాలి అంటే ఇంకొద్ది కాలం ఆగాల్సిందే.. నేను తెలంగాణ కు కాప‌లాదారుడిగా ఉంటాను అని చెప్పిన వారు.. ఆ జ‌న్మాంతం టీఆర్ఎస్ తోనే జీవితం అని చెప్పిన వారు.. గురుకులం అభివృద్ధే ధ్యేయం అన్న‌వారు.. ఇప్పుడు స‌డెన్ గా కొత్త స్వ‌రం వినిపిస్తుండ‌డంతో ఆంత‌ర్యం తేల‌డం లేదు...ఇప్పుడు వీరి మాట‌ల‌కు హ‌ద్దే లేదు.. హ‌ద్దులు దాటాక వీరికి స‌ఖ్య‌త ఎలా కుదురు తుంది.. కుదర‌దు క‌దా! మేం బానిసలం కాదు మేం చెప్తే నిల‌దొక్కుకున్న జీత‌గాడివి నువ్వు అని కేసీఆర్ ను ఉద్దేశించి
ప్ర‌జా సంఘాలు ఫైర్ అవుతున్నాయి..

మ‌రి! బానిసలు  అంతా తిరుగుబాటుకు  చ‌లిచీమ‌లంతా తిరుగుబాటుకు సిద్ధం అయితే రాజ్య కాంక్ష అన్న‌ది వీరిలో ఎవ్వ‌రిలోనూ లేకుండా ఉంటే.. అప్పుడు స‌చ్ఛీలుడు అనిపించే నాయ‌కుడు పుట్టుకు వ‌స్తాడ‌ని వాడే అమ‌రేంద్ర బాహు బ‌లి కి మించిన వాడు అవుతాడ‌ని చెబుతున్నారు కొంద‌రు.. మ‌రి! నార‌ప్ప సంగ‌తేం కావాలి..బ‌హుజ‌న పార్టీ పేరుతో సంద‌డి చేయాల‌నుకుంటున్న నార‌ప్ప‌కు నీరాజనం ద‌క్కుతుంది..అని అనుకోగ‌ల‌మా.. కేసీఆర్ ది ఆత్మగౌర‌వం నినాదం ఒక‌ప్పుడు ఇప్పుడు ప్ర‌వీణ్ ది ఆత్మ గౌర‌వ నినాదం.. కేసీఆర్ బంటు నుంచి రాజు ప్ర‌వీణ్ రాజాస్థానం నుంచి రాజ్యం ఇచ్చిన అధికారం నుంచి ప‌క్క‌కు తొల‌గిన అధికారి.. తాజా నాయ‌కుడు..ఓయూ లో ఇంకొంద‌రు నార‌ప్ప‌లు ఉన్నారు.,. ఆత్మ గౌర‌వ ప్ర‌తీక‌లు వారు.. వారు  వార్ లో పాల్గొన్నారు.. ఉద్య‌మంలో గొంతు వినిపించారు.. వారు ఇప్పుడు రాజ్యాధికారం కావాల‌ని అంటున్నారు. అవును ఉద్య‌మ కారుల‌దే రాజ్యం అని ఆ రోజు..దొర‌ల‌దే రాజ్యం అని  ఇప్పుడు అంటుండ‌డంలో కేసీఆర్ అనే బాహుబ‌లి స‌ఫ‌లీకృతం అయ్యార‌ని, అందుకే ఆయ‌న తీవ్ర స్వ‌రంతో ఏం అయినా చెప్పి చేయ‌గ‌ల‌ర‌ని మండిప‌డుతున్నారు. ఇక క‌ట్ట‌ప్ప‌లాంటి బానిస‌లు ఎట్లుంట‌రు?


ప్ర‌జ‌లు బానిస‌లు కాదు బానిసల్లా చూస్తున్నారు అని ప్ర‌వీణ్ లాంటి వారు వాపోతున్నారు..క‌న్నీళ్లు పెట్ట‌డం మిన‌హా ఏం చేయ‌లేమ‌ని విమ‌ల‌క్క లాంటి వారు ఆగ్ర‌హం చెందుతున్నారు.. ఇప్పుడు నార‌ప్ప‌ల‌దే రాజ్యం కావాలి.. విద్య , వైద్యం లో ఊహించ‌ని పురోగ‌తి, విభిన్న రంగాల్లో ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం అందుకు అనుగుణం అయిన అభివృద్ధి ద‌ళిత, గిరిజ‌న వ‌ర్గాల మ‌ధ్య ఉంటే ఆశించిన ప్ర‌గ‌తి సాధ్యం అవుతుందని ప్ర‌వీణ్ అనే నార‌ప్ప చెబుతున్నారు.. ఆ ప‌నికి ఎవ‌రు పూనుకుంటే వారికే మ‌ద్దతు ఇస్తాన‌ని చెబుతున్నారు. మ‌రి! నార‌ప్ప‌ది రాజ్యం కావాలంటే ఆయ‌నేం చేయాలి.. ? ఆయ‌న కూడా ఇంకొంత వేగంగా ప‌నిచేయాలి.. త‌న వారిలో న‌మ్మ‌కం మ‌రింత క‌లిగిస్తే ఆయ‌నే ఫ్యూచ‌ర్ లీడ‌ర్ .. అప్పుడు క‌ట్ట‌ప్ప‌లు అంతా రాజ్యాధికారం పొందేందుకు వీలు ఉంటుంది.. బాహుబ‌లి గౌర‌వంగా త‌ప్పుకుంటే .. భావి భార‌తావ‌నిలో సామాజిక తెలంగాణ నిర్మాణం సాధ్యం..

మరింత సమాచారం తెలుసుకోండి: