
వివరాల్లోకి వెళ్తే బికేయు భారత్ కిసాన్ యూనియన్ పేరుతో మొన్న ఉత్తరప్రదేశ్, హర్యానాకు సంబంధించిన రైతులు కేంద్రం రైతు చట్టాలు చేయకుండా ఉండడం కోసం రైతు ఉద్యమాలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఎర్రకోటపై దాడి కూడా చేసిన సంఘటన అప్పుడు జరిగింది. అసలు బికేయు భారత్ కిసాన్ యూనియన్ చరిత్ర ఇప్పటిది కాదు. చాలా చరిత్ర ఉన్న సంస్థ అది. దానికి సంబంధించిన రైతు పోరాటాల గురించి ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో గతంలో పాఠ్యాంశంగా పెట్టుకొచ్చారు.
రాకేష్ కాకుండా భారత్- ఏ కిసాన్ యూనియన్ అనే పేరుతో రైతు ఉద్యమాల గురించి ఆ ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో పాఠ్యాంశంగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఈ పాఠ్యాంశాన్ని తొలగించింది. ఎందుకంటే బీకేయు భారత్ కిసాన్ యూనియన్ కి సంబంధించిన రైతు పోరాటాల గురించి పిల్లలకు పాఠ్యాంశాలు బోధిస్తున్నప్పుడు అన్ని ఉద్యమాలు లాగే మొన్న ఉత్తర్ ప్రదేశ్, బీహార్ కు సంబంధించిన రైతులు ఢిల్లీలో చేసినటువంటి రైతు ఉద్యమాల గురించి కూడా చెప్పాల్సి వస్తుంది అని, అందుకోసమే ఈ పాఠ్యాంశాన్ని తొలగించారని తెలుస్తుంది.
ఎందుకంటే ఈ పాఠ్యాంశాలు విద్యార్థులకు బోధించేటప్పుడు ఆ ఉద్యమాల గురించి పిల్లలలో ఒక భావం నాటుకు పోతుందని, ముందు ముందు దాని వల్ల ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయో చెప్పలేమని అనుకుని కేంద్ర ప్రభుత్వం ఈ పాఠ్యాంశాన్ని తొలగించిందని కొంతమంది అంటున్నారు. దీనిపై ప్రజలు ఏమనుకుంటారో కానీ ప్రకాష్ రాజ్ మాత్రం దీనిని ఒక నియంత పాలన అని విమర్శించడం అయితే జరుగుతుందని అంటున్నారు.