ప్రస్తుత రోజులలో ప్రతి ఒక్కరు ప్రభుత్వ  ఉద్యోగం  కోసం చాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇలా చేసే ప్రయత్నంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. కానీ వీరి అందరికి సర్కార్ నుంచి నిరాశపర్చే వార్త తెలియచేసింది. యువత చాల రోజుల నుంచి ఎదురు చూస్తున్న గ్రూప్‌-1 నోటిఫికేషన్ ఇంకా ఆలస్యం అయ్యే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. వాస్తవానికి  గత సంవత్సరంలోనే   విడుదల చేయాలని  అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ  అనివార్య, సాంకేతిక పరమైన కారణాల వల్లే నోటిఫికేషన్  విడుదల చేయలేదు.  

 


దీనితో తెలంగాణ రాష్ట్రం చాల కాలం నుంచి ఇప్పటి వరకు గ్రూప్‌-1 ప్రకటన ఇవ్వడం లేదు, మరో వైపు అభ్యర్థుల వయసు దాటిపోతుండడంతో నిరుద్యోగులు బాగా ఆందోళనలో ఉన్నారు. ఏడాదిన్నర క్రితం అంటే 2018 జూన్‌ 2న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.

 

 అప్పుడు నిలిచి పోయిన.. తర్వాత కొత్త జోనల్‌ విధానంపై భారత రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ ఘటన  జరిగి దాదాపు ఏడాది అవుతోంది. అయినా, గ్రూప్-1 నోటిఫికేషన్‌ను విడుదలకు సిద్ధంగా లేదు అంటే చాల బాధ కరమైన విషయం.

 

 ఇది ఇలా ఉండగా  మరోవైపు, తెలంగాణ సివిల్‌ సర్వీస్‌లు, కేంద్ర, రాష్ట్ర పోటీ పరీక్షలకు ఉమ్మడి సిలబస్‌పైనా ఎలాంటి నిర్ణయం తీసుకున్నట్లు కనపడం లేదు.  ఇక  కొత్త జోనల్‌ విధానం ప్రకారం.. సర్వీస్ రూల్స్, పోస్టుల విభజన, క్షేత్ర స్థాయిలో ఉద్యోగుల కేటాయింపు వంటి విధానాలు పూర్తయ్యేందుకు ఇంకో  రెండేళ్ల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి అని ఉన్నతాధికారులు విశ్వసనీయంగా తెలియచేయడం జరిగింది.

 

అప్పట్లో  గ్రూప్-1 నియామక పోస్టులను 138గా గుర్తించడం జరిగింది.  అసలు  నిలిపివేతకు  గల ముఖ్యమైన కారణాలు తెలుసుకుందామా మరి... గ్రూప్‌-1 ప్రకటన కింద తొలుత సర్కారు 138 పోస్టులు ఉన్నాయని తెలియచేయడం జరిగింది. ఈ పోస్టులు భర్తీ చేయాలని 2018 జూన్‌ 2న నోటిఫికేషన్‌ విడుదల చేయాల్సి ఉండేది. కానీ  కొత్త జోనల్‌ విధానం వచ్చే వరకు ఉద్యోగ భర్తీ ప్రకటనలు నిలిపేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడం జరిగింది. అందుకే నోటిఫికేషన్‌ విడుదల అగ్గిపోవడం జరిగింది. ఇక గ్రూప్‌-1 మాత్రమే కాకుండా గ్రూప్‌-2, గ్రూప్-3 పోస్టులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనలు పెండింగ్‌లోనే ఉన్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: