
ఈ మధ్య కాలంలో చాలామందికి ఆరోగ్యం విషయంలో కేర్ పెరుగుతోంది. మొలకలు తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే మొలకలు ప్రతిరోజూ తీసుకునే వాళ్ళు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. పచ్చి మొలకలు తినడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ప్రధానంగా మొలకలు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే అవకాశం అయితే ఉంటుంది.
మొలకలలో సాల్మొనెల్లా, ఇకోలి, లిస్టెరియా వంటి హానికరమైన బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ బ్యాక్టీరియా ఆహార సంబంధిత వ్యాధులకు కారణమయ్యే ఛాన్స్ అయితే ఉంది. పచ్చి మొలకలు సాల్మొనెల్లా, ఇ. కోలి వంటి బ్యాక్టీరియాకు నిలయంగా ఉండటం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి మొలకల వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.
సరిగా శుభ్రం చేయని మొలకలు, లేదా నాణ్యత లేని మొలకలు తినడం వల్ల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరుగుతుందని వైద్యులు సైతం చెబుతున్నారు. శరీరానికి ప్రోటీన్ అవసరం అయినా మరీ ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ లభించడం వాళ్ళ లాభం కంటే నష్టం ఎక్కువగా కలుగుతుంది. మొలకల్లోని బ్యాక్టీరియా అతిసారానికి కారణమవుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
పిల్లలు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారిలో మరింత ప్రమాదకరంగా మొలకలు మారతాయి. మొలకలు బయట కొనుగోలు చేయడం కంటే ఇంట్లో సొంతంగా తయారు చేసుకోవడం మంచిది. మొలకలను సరిగా జీర్ణం చేసుకోలేకపోతే కడుపు నొప్పి, ఉబ్బరం లాంటి సమస్యలు తలెత్తే ఛాన్స్ ఉంటుంది. మొలకలను బాగా ఉడికించి లేదా వేడి చేసిన తర్వాత తినడం ద్వారా కొన్ని సమస్యలను అధిగమించవచ్చు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు