డెంగ్యూ దోమలను అరికట్టడానికి, మీరు మీ ఇంటి చుట్టూ నీరు నిలిచిపోకుండా చూసుకోవడం ముఖ్యమని చెప్పవచ్చు.  దోమ తెరలు ఉపయోగించడం, పొడవాటి దుస్తులు ధరించడం మరియు దోమల వికర్షకాలను ఉపయోగించడం వంటివి  చేయడం ద్వారా దోమల బారిన పడకుండా రక్షించుకోవచ్చు.  దోమలు గుడ్లు పెట్టడానికి నీరు నిల్వ ఉన్న ప్రదేశాలను ఉపయోగిస్తాయి. కాబట్టి, టైర్లు, బకెట్లు, పూల కుండీలు మరియు ఇతర వస్తువులలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడితే దోమల సమస్యకు చెక్ పెట్టవచ్చు.

కిటికీలు, తలుపులకు దోమతెరలను ఉపయోగించడం ద్వారా దోమలు ఇంట్లోకి రాకుండా  అరికట్టే ఛాన్స్ అయితే ఉంటుంది.  పొడవాటి చేతులు, కాళ్లు ఉన్న దుస్తులు ధరించడం ద్వారా దోమ కాటు నుండి మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉంటుందని చెప్పవచు.  DEET లేదా ఇతర దోమల వికర్షకాలను చర్మానికి లేదా బట్టలకు రాసుకోవడం ద్వారా దోమల నుండి రక్షణ పొందే ఛాన్స్ ఉంటుంది.

 డెంగ్యూ దోమలు పగటిపూట చురుకుగా ఉంటాయి, కాబట్టి ఆ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండటం ఎంతో  అవసరమని చెప్పవచ్చు.  ఇంటి చుట్టూ పరిశుభ్రత పాటించడం  దోమల నివారణకు  దోహదపడుతుందని చెప్పవచ్చు.  వారానికి ఒకసారి ఇంటిలోని నీటి తొట్టెలను శుభ్రం చేసి, నీటిని మార్చడం ద్వారా దోమల పెరుగుదలను అరికట్టే అవకాశాలు అయితే ఉంటాయి.

 డెంగ్యూ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.  నైరుతి రుతుపవనాల రాకతో  దేశంలో డెంగ్యూ కేసుల సంఖ్యా  పెరుగుతోంది.   ఈ వ్యాధి బారిన పడిన వాళ్లలో  అధిక జ్వరం, తలనొప్పి, శారీరక నొప్పులు, వికారం, దద్దుర్లు ఇలా అత్యంత సాధారణ లక్షణాలు కనిపించే ఛాన్స్ అయితే ఉంటుంది.  తగిన  జాగ్రత్తలు  తీసుకోవడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.  డెంగ్యూ నిర్ధారణ అయితే చికిత్స కోసం కూడా ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: