సాధారణంగా ఉలవలు ఆరోగ్యానికి అద్భుతమైన ఔషధం అని చెప్పవచ్చు.  ముఖ్యంగా 100 గ్రాముల ఉలవల్లో 329 క్యాలరీలు మనకు లభిస్తాయి.  అంతేకాదు 22 గ్రాముల ప్రోటీన్, 8 గ్రాముల ఫైబర్ , 0.6 గ్రాముల కొవ్వు కలిగి ఉంటాయి.  ఇక ముఖ్యంగా ఉలవల్లో ఇన్సులిన్ అనే కెమికల్ కాంపౌండ్ మనం తీసుకున్న తర్వాత ప్రేగులలో ఉండే బ్యాక్టీరియాలోని కణాలను సిమిలేట్ అవ్వడానికి ఈ కెమికల్ చాలా సహాయపడుతుంది. అంతేకాదు మధుమేహంతో బాధపడేవారికి  ఉలవలు ఒకరకంగా దివ్య ఔషధమని చెప్పవచ్చు.  ముఖ్యంగా వీటిలో ఉండే కెమికల్ కాంపౌండ్ స్పెషల్ గా తిన్నారంటే పైరు గ్లూటా మిలియన్, గ్లూటమిన్ జీర్ణ వ్యవస్థ ద్వారా లోపలికి పోతాయి. తదుపరి ఇంక్రిటిష్ అనేటువంటి కెమికల్ కూడా విడుదల చేస్తుంది. దీనివల్ల బీటా సెల్స్ సిమ్లేట్ చేస్తుంది.

ఇకపోతే ఉలవలు తీసుకోవడం వల్ల ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది. ఫైబర్ తీసుకోవడం వల్ల ఎటువంటి రోగాలైనా దూరం పోతాయి. ముఖ్యంగా ఉలవలను నానబెట్టి గుగిల్లు గా ఉడకబెట్టుకొని పోపు పెట్టుకొని కూడా తినవచ్చు. ముఖ్యంగా విలువలతో తయారు చేసే రసం తినడానికి ఎంత రుచికరంగా ఉంటుందో వర్ణనాతీతం . ఇక చాలామంది కొన్ని తెగల వాళ్ళు బిర్యానీలోకి ఉలవచారును ప్రత్యేకంగా తయారు చేసుకొని మరీ  తింటూ ఉంటారు. అందుకే ఉలవచారు బిరియాని అనే ఒక ఫేమస్ వంటకం కూడా భోజన ప్రియులను మరింతగా ఆహ్వానిస్తుందని చెప్పవచ్చు.

ముఖ్యంగా ఉలవలు తినడం వల్ల ఇన్నోసిటీలానే అనే ఒక కెమికల్ కాంపౌండ్ బ్రెయిన్ కి కావలసిన పూర్తి శక్తిని అందిస్తుంది.  ముఖ్యంగా మెదడుకి డామేజ్ కలగకుండా రక్షణ కల్పిస్తుంది.  ఇక దీనివల్ల అల్జీమర్స్ బ్రెయిన్ స్ట్రోక్ వంటి ఇబ్బందులు రాకుండా రక్షించుకోవచ్చు. ఇక  ప్రయోజనాలను కలిగి ఉన్న ఉలవలు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదే కానీ గర్భిణీ స్త్రీలు ఉలవలను తీసుకోకూడదు. ఎందుకంటే శరీరంలో వేడి ఎక్కువ స్రావం జరిగే ప్రమాదం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: