పైనాపిల్‌ లో చాలా పోషకాలు దాగి ఉన్నాయి. విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లల్లో  ఈ పండు కూడా ఒకటి. దీనిలో ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ డి ఇంకా విటమిన్ బి6 వంటి పోషకాలు  ఉన్నాయి. పైనాపిల్‌ ను  తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీరాడికల్స్ తో పోరాడి క్యాన్సర్ బారిన పడే అవకాశాలను కూడా సులభంగా తగ్గిస్తాయి. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు కంటి చూపును పెంచడంలో కూడా పైనాపిల్‌ చాలా బాగా ఉపయోగపడుతుంది.అలాగే పైనాపిల్‌ ను తీసుకోవడం వల్ల ఎముకల కూడా చాలా బలంగా తయారవుతాయి. దీనిని ముక్కలుగా చేసి తీసుకున్నా లేదా జ్యూస్ గా చేసి తీసుకున్నా కూడా మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పైనాపిల్‌ జ్యూస్ చాలా అంటే చాలా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక.


పైనాపిల్‌ పై ఉండే చెక్కును తొలగించి ముక్కలుగా చేసి జార్ లోకి తీసుకోని ఆ తరువాత అందులో పంచదార లేదా తేనె వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని వడకట్టి గ్లాస్ లోకి తీసుకుని తాగాలి.ఇలా చేయడం వల్ల చాలా రుచిగా ఉండే పైనాపిల్‌ జ్యూస్ తయారవుతుంది. అయితే ఈ జ్యూస్ లో పంచదారను వేసుకోకపోవడమే ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో చల్లదనం కోసం మీరు ఐస్ క్యూబ్స్ ను కూడా వేసుకోవచ్చు.ఈ విధంగా తయారు చేసిన పైనాపిల్‌ జ్యూస్ ను పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు.పైనాపిల్‌ ను తిన్నా లేదా జ్యూస్ గా చేసుకుని ఇలా చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో గాయాలు కూడా త్వరగా మానుతాయి. శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థని బాగా మెరుగుపరిచి రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా చేయడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో ఇంకా సైనస్ వంటి సమస్యలను తగ్గించడంలో కూడా పైనాపిల్‌ చాలా బాగా సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: