నేరేడు పండ్లు లేదా జామున్ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే కొన్ని పరిస్థితుల్లో లేదా కొన్ని విధాలుగా తినడం వల్ల ఇవి హానికరం అవుతాయి. నేరేడు పండ్లను తప్పుగా తీసుకోవడం వల్ల వచ్చే ప్రమాదాల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఖాళీ కడుపు మీద తింటే ప్రమాదం. నేరేడు పండ్లలో ఆమ్లత గల స్వభావం ఉంది. ఖాళీ కడుపుపై తింటే. గ్యాస్ట్రిక్ సమస్యలు, అజీర్ణం, కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. పాళీగా ఎక్కువ తింటే బీపీ తగ్గిపోవచ్చు. నేరేడు పండ్లు రక్తపోటును తగ్గించే గుణం కలిగినవి. తలనొప్పి, బలహీనత వంటి లక్షణాలు వస్తాయి. బీజాలు లేకుండా కూడా ఎక్కువ నేరేడు పండ్లు తింటే. మలబద్ధకం, అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది.

షుగర్ పేషంట్లు జాగ్రత్తగా తినాలి. నేరేడు పండ్లు సాధారణంగా షుగర్ నియంత్రణలో సహాయపడతాయి కానీ, ఇన్‌సులిన్ మందులు తీసుకునే వారు ఎక్కువగా తింటే, రక్తంలో షుగర్ చాలా తగ్గిపోవచ్చు. ఇది హైపోగ్లైసీమియా అనే పరిస్థితికి దారితీయవచ్చు. గర్భిణీ స్త్రీలు అధికంగా తీసుకోవద్దు. కొంతమందిలో ఈ పండ్లు. శరీర ఉష్ణోగ్రత పెరగడం, గర్భసంచిలో అసౌకర్యం కలగడం వంటి ప్రభావాలను చూపవచ్చు. నీటితో వెంటనే తినకూడదు. నేరేడు తిన్న వెంటనే చల్లటి నీళ్లు తాగితే, గొంతు నొప్పి, జలుబు, అజీర్ణం వంటి సమస్యలు రావచ్చు. గుండె సంబంధిత మందులు వాడుతున్న వారు జాగ్రత్త, నేరేడు పండ్లలో "జాంబోలిన్" అనే పదార్థం ఉంటుంది.

ఇది కొన్నిపాటి మందులతో కలిసిపోతే, మానవ శరీరంలో ప్రతికూల ప్రభావాలు చూపవచ్చు. భోజనం తర్వాత అరగంట గ్యాప్ తర్వాత తినాలి. ఒకేసారి ఎక్కువ కాకుండా గరిష్ఠంగా 6–10 పండ్లు మాత్రమే తినాలి. చల్లటి నీళ్లు తాగకూడదు – కనీసం అరగంట గ్యాప్ ఇవ్వాలి. బీజాలను తొలగించి తినడం మంచిది. అలర్జీ ఉన్నవారు మితంగా తీసుకోవాలి. నేరేడు పండ్లు ఆరోగ్యానికి మంచివే. కానీ అవి తినే విధానం, సమయం, పరిమితి పట్ల జాగ్రత్తలు పాటించకపోతే… యమా డేంజర్. ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవాలంటే, ఈ పండ్లను మితంగా, సరైన సమయంలో మాత్రమే తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: