
ఇవి జింక్ సమృద్ధిగా కలిగి ఉండటంతో, పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ పెరిగే అవకాశం ఉంది. టెస్టోస్టెరాన్ స్థాయిని స్తిరంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి. గుమ్మడికాయ గింజల్లో ట్రిప్టోఫాన్ అనే యామినో యాసిడ్ ఉంటుంది. ఇది మెలటొనిన్ హార్మోన్ ఉత్పత్తికి దోహదపడుతుంది. ఇది నిద్రను మెరుగుపరిచి, నిద్రలేమి సమస్యను తగ్గిస్తుంది. జింక్, విటమిన్ E ల వంటి యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని వైరస్లు, బ్యాక్టీరియా నుండి రక్షించడంలో కీలకంగా పని చేస్తాయి. ఇందులో మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది బీపీని స్తిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. కాబట్టి హై బీపీ లేదా లో బీపీ ఉన్నవారికి ఇది ఎంతో ఉపయోగకరం. గుమ్మడికాయ గింజలు యూరిన్ ఫ్లోను మెరుగుపరచడంతో పాటు, ప్రోస్టేట్ ఆరోగ్యాన్ని కాపాడతాయి.
ముఖ్యంగా వయస్సు పైబడిన పురుషులలో ప్రోస్టేట్ విస్తరణను నియంత్రించడంలో ఇవి సహాయపడతాయి. గుమ్మడికాయ గింజల్లో విటమిన్ E అధికంగా ఉండటంతో చర్మానికి తేజాన్ని ఇస్తుంది. జింక్ మరియు ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు రాలుదలను తగ్గించడంలో సహాయపడతాయి. రోజుకు 1-2 టేబుల్ స్పూన్లు తినడం సరిపోతుంది. వేయించకుండా, ఉప్పు లేకుండా తినడం మంచిది. రాత్రి నిద్రకు ముందు తినితే మంచి నిద్ర కోసం ఉపయోగపడుతుంది. బ్రేక్‌ఫాస్ట్ లేదా స్నాక్స్‌గా చేర్చవచ్చు. స్మూథీలలో కలపవచ్చు లేదా సలాడ్స్‌పై చల్లి తినవచ్చు. ఎక్కువగా తింటే అజీర్ణం లేదా మలబద్దకం వంటి సమస్యలు రావొచ్చు. ఆలెర్జీ ఉన్నవారు లేదా గర్భిణీలు డాక్టర్ సలహా తీసుకుని వాడాలి. ఉప్పు వేసిన వేరియంట్లు ఎక్కువగా తినకూడదు.