ప్రస్తుతం దేశవ్యాప్తంగా శర వేగంగా వ్యాప్తి చెందుతూ అందరికీ ప్రాణ హాని కలిగిస్తున్న కరోనా వైరస్  గత కొన్ని రోజుల నుంచి బాలీవుడ్ చిత్ర పరిశ్రమ పై పంజా విసురుతున్న విషయం తెలిసిందే. క్రమంగా ఎంతో మంది సినీ ప్రముఖులు కరోనా  వైరస్ బారినపడి ఆసుపత్రి పాలవుతున్నారు. మొన్నటికి మొన్న అమితాబ్ బచ్చన్ కుటుంబంలో కరోనా  వైరస్ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో  అభిమానులందరూ తీవ్ర ఆందోళన చెందారు. ఇక ఆ తర్వాత మొన్నటికి మొన్న ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ సహా మిగతా కుటుంబ సభ్యులకు కూడా కరోనా  పాజిటివ్ అని వచ్చింది,



 ఇలా వరుసగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు కరోనా వైరస్ బారిన పడుతుండటం తో మిగతా నటుల్లో కూడా ఆందోళన మొదలైంది. ఇక తాజాగా ఈ జాబితాలో యువ హీరోయిన్ సారా అలీ ఖాన్ వచ్చి చేరారు. ఇటీవలే తన కార్ డ్రైవర్ కి కరోనా వైరస్ పాజిటివ్ అని వచ్చినట్లు సారా అలీ ఖాన్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన సారా అలీ ఖాన్ కుటుంబ సభ్యులు ఇతర సిబ్బంది కూడా కరోనా  నిర్ధారిత టెస్టులు చేసుకున్నారని... అయితే అందరికీ నెగిటివ్ వచ్చింది అంటూ చెప్పుకొచ్చారు.




ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ఓ ప్రకటన విడుదల చేశారు సారా అలీ ఖాన్. అయితే సారా అలీ ఖాన్ డ్రైవర్ కి కరోనా పాజిటివ్ రావడంతో ఎక్కడ సారా అలీ ఖాన్ కూడా కరోనా  వైరస్ బారిన పడతారో అని  అని అభిమానులు ఎంతగానో ఆందోళన చెందారు. కానీ తనకు పరీక్షలో నెగిటివ్ వచ్చినట్లు   సారా అలీ ఖాన్ క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు... అయితే తన కార్ డ్రైవర్ కి పాజిటివ్ టాక్ రావడంతో క్వారంటైన్  కు తరలించినట్లు సారా అలీ ఖాన్ తెలిపారు. ప్రస్తుతం తనతో పాటు తన కుటుంబ సభ్యులతో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని.., మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అంటూ అభిమానులకు సూచించారు సారా అలీ ఖాన్. ఇలా వరుసగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కరోనా  వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువవుతున్న  తరుణంలో ఎంతో మంది సినీ సెలబ్రిటీలు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: