ప్రముఖ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గురించి ప్రపంచంలోని క్రికెట్ ప్రేమికులు ఎవరికీ కూడా ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. క్రికెట్ గాడ్ గా చెప్పబడే సచిన్ టెండూల్కర్ ఎన్నో వన్డే లు టెస్ట్ ల్లో గొప్ప సంచలన రికార్డులు అందుకుని క్రికెట్ లో భారత దేశ ఖ్యాతిని అమాంతం పెంచారు. ఇక సచిన్ కి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ కూడా కోట్లాదిమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన ఒక్కసారి కనపడితే చాలు కోట్ల అభిమాన హృదయాలు ఆనంద ఢోలికల్లో తేలి ఆడుతాయి. ఇక తన రిటైర్మెంట్ తరువాత తన తనయుడు అర్జున్ టెండూల్కర్ ని మంచి క్రికెటర్ ని చేయాలని భావించిన సచిన్, ప్రస్తుతం అతడికి ప్రత్యేకంగా ఆటతో పాటు పలు ఇతర అంశాల్లో కూడా శిక్షణ ఇప్పిస్తున్నట్లు సమాచారం.
ఇటీవల అర్జున్ ముంబై తరపున పలు దేశవాళీ మ్యాచ్ లు ఆడి మంచి ప్రతిభ కనబరిచారు. కాగా అతడిని అతి త్వరలో ప్రారంభం కాబోయే ఐపీఎల్ లో ఎంపిక చేయనున్నారనే వార్తలు కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్నాయి. అయితే కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మరణమ్ తరువాత మన దేశంలో ఒక్కసారిగా నెపోటిజం పై ఉవ్వెత్తున నిరసన జ్వాలలు ఎగసిపడ్డాయి. సినిమా పరిశ్రమ సహా అన్ని రంగాల్లోనూ నెపోటిజం ఎక్కువయిందని, ప్రతి ఒక్క సెలెబ్రటీ తమ వారసులను మాత్రమే పైకి తీసుకువస్తూ ఇతరులను అణగదొక్కుతున్నారనే విమర్శలు పలువురు ప్రజలు వ్యక్తం చేసారు. 

అలానే అర్జున్ టెండూల్కర్ పై కూడా నెపోటిజం విమర్శలు కురిసాయి. కాగా అతడి గురించి కొద్దిసేపటి క్రితం ప్రముఖ బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ తన సోషల్ మీడియా మాధ్యమాల వేదికగా మాట్లాడుతూ మద్దతు పలికాడు. తనకు ఎప్పటినుండో అర్జున్ తెలుసునని, డైలీ జిమ్ లో అతడు పడే కష్టం చూస్తే నిజంగా ఎంతో ఆశ్చర్యంగా ఉంటుందని, తప్పకుండా అతడు రాబోయే రోజుల్లో మంచి క్రికెటర్ అవుతాడని ఆశాభావం వ్యక్తం చేసారు. అలానే అతడిపై నెపోటిజం వంటి లేనిపోని విమర్శలు ఎత్తిచూపి అతడిలోని నిజమైన ప్రతిభని హత్య చేయకండి అంటూ ఫర్హాన్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది .....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: