ప్యాన్
ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి
రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో పూజాహెగ్డే
హీరోయిన్ గా నటిస్తోంది. పిరియాడికల్ ప్రేమకథ నేపథ్యంలో ఈ
సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ
సినిమా షూటింగ్ ను ప్రభాస్ పూర్తి చేసుకున్నారు. ఈ
సినిమా షూటింగ్ లో ఉండగానే ప్రభాస్ మరో రెండు సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వాటిలో ఒకటి
బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఆదిపురుష్. పౌరాణిక కథ రామాయణం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్నారు. అంతే కాకుండా
బాలీవుడ్ నటుడు సైష్ అలీఖాన్ రావణుడి పాత్రలో విలన్ గా నటిస్తున్నారు. చిత్రంలో ప్రభాస్ సరసన
సీత పాత్రలో కృతి సనన్ నటిస్తోంది. ప్రస్తుతం ఈ
సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఎప్రిల్ మొదటి వారం వరకు ముంబైలో ఈ
సినిమా షూటింగ్ జరగనుంది.
ఆదిపురుష్ తో పాటు ప్రభాస్ సలార్
సినిమా షూటింగ్ లోనూ పాల్గొంటున్నారు. సలార్ సినిమాకు
కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో
హీరోయిన్ గా సృతి హాసన్ నటిస్తోంది. ఇక మొదట కొన్ని రోజులు ఈ
సినిమా షూటింగ్ ను గోదావరిఖని లోని బొగ్గు గనుల్లొ చిత్రించారు. ఇక్కడ సినిమాలోని భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు..సృతిహాసన్ ప్రభాస్ మధ్య కొన్ని సన్నివేశాలను చిత్రించారు. ఈ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ప్రభాస్ ఆదిపురుష్ షూటింగ్ లో పాల్గొనేందుకు
ముంబై వెళ్లారు. ఇక ఆదిపురుఫ్ మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా మళ్లీ సలార్ షూటింగ్ కోసం ప్రభాస్ హైదరాబాద్ వస్తున్నట్టు సమాచారం. దీని కోసం హైదరాబాద్ పరిసరాల్లో ఓ భారీ సెట్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సలార్ చిత్రాన్ని వచ్చే ఏడాది. ఎప్రిల్ 14న విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఇక ఆదిపురుష్ సినిమాను 2022 ఆగస్టు 11న విడుదల చేయనున్నారు.