లేడీ అమితాబ్ గా టాలీవుడ్ లో లో పేరు తెచ్చుకున్న విజయశాంతి సినిమాల్లోకి రావడం చిత్రంగా జరిగింది. ఆమె నటి విజయ లలిత అక్క కూతురు. విజయశాంతి ను కూడా ఆర్టిస్టు చేయాలనే తపన ఆమెకి ఉండేదట. అందుకే విజయశాంతి ఫోటోలు తీయించి తనకు తెలిసిన వాళ్ళు అందరినీ కలిసి అవకాశాలు ఉంటే ఇవ్వమని అడిగేదట. సరిగ్గా అదే సమయంలో కిలాడి కృష్ణుడు చిత్రం షూటింగ్ మొదలైంది. విజయ నిర్మల దర్శకురాలు. అందులో కీలక పాత్ర పోషించిన గిరిబాబు కి విజయలలిత విజయశాంతి ఫోటో పంపించగా ఈ విషయాలను ఆయనే వెల్లడించారు. ఆ సినిమాలో ఆమెకు అవకాశం వచ్చేలా తన చేసాడట గిరిబాబు.

కిలాడి కృష్ణుడు సినిమాలో నాకు కూడా వేషం చెప్పారు. విలన్ వేషం అది. ఆ సినిమాలో కథానాయికగా మొదట స్వప్న అనే నటిని ఎంపిక చేశారు. దాసరి నారాయణరావు గారు పరిచయం చేసిన హీరోయిన్ ఆమె.  వేరే ఊర్లో షూటింగ్ లో ఉండటం వల్ల నేను ప్రారంభోత్సవానికి హాజరుకాలేకపోయాను. మూడు రోజు షూటింగ్ ఉండడంతో షూటింగ్ స్పాట్ కు వెళ్లాను. అప్పుడే హీరోయిన్ స్వప్నం చూశాను. ఎందుకోగాని ఈ సినిమాలో ఆమె హీరోయిన్ అంటే నాకు నచ్చలేదు.
కృష్ణ గారి వంటి టాప్ హీరో పక్కన నటించాల్సిన హీరోయిన్ ఆమె కాదని అనిపించింది. అందుకే షాట్ గ్యాప్ లో కూర్చుని వారిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న స్వతంత్రం కొద్దీ ఆ అమ్మాయిని హీరోయిన్ గా పెట్టారు ఏమిటి అని అడిగాను. ఆ అమ్మాయి నాకు అస్సలు నచ్చలేదు అని నిర్మొహమాటంగా చెప్పాను.

విజయనిర్మల గారు కూడా ఈ అమ్మాయి తో రెండు రోజులే షూటింగ్ చేశాం కావాలంటే మార్చేద్దాం అని అన్నారు. నా మాటకు ఎంతో విలువ ఇచ్చి వారు ఆ అమ్మాయిని మార్చివేశారు. అప్పుడే నాకు విజయశాంతి గుర్తుకు వచ్చింది. వెంటనే ఆమె గురించి చెప్పాను. మన విజయలలిత వాళ్ళ అక్క కూతురు బాగా ఉంటుందట. 16 ఏళ్ళు ఉంటాయేమో. గుత్తా రామినీడు గారు ఆమె గురించి చెప్పారు. అంతే కాదు నువ్వు సినిమా తీస్తే ఆమెను హీరోయిన్ గా పెట్టుకోమని చెప్పారు గుత్తా రామినీడు గారు. వెంటనే కృష్ణ గారు పిలిపించారని చెప్పారు. విజయలలిత కు చేసి విజయశాంతి తీసుకురమ్మని చెప్పాను. కృష్ణ గారు చూసి నచ్చింది అని  విజయ నిర్మల గారికి చెప్పగా ఆమెకు తొలి సినిమా ఓకే అయ్యింది.   అలా ఎవరో చేయాల్సిన సినిమా విజయశాంతికి రావడంలో గిరిబాబు ఆమెకు ఎంతో హెల్ప్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: