నేచురల్ స్టార్ నాని, అంజనా సౌత్ లోని బ్యూటీ ఫుల్ స్టార్ కపుల్స్ లో ఒకరు. నాని తరచుగా తన భార్య, కొడుకుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వారిపై ప్రేమను వ్యక్తపరుస్తుంటాడు. ఇప్పుడు సక్సెస్ ఫుల్ హీరోగా మారిన నాని కూడా ఒకప్పుడు సామాన్య స్థాయి నుంచి వచ్చినవాడే. విలక్షణమైన హీరోగా తన సహజమైన నటనతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో నాని అంటే సక్సెస్ గ్యారెంటీ అని నిర్మాతలు నమ్ముతున్నారు. తన అద్భుతమైన నటనతో థియేటర్లలో పైసా వసూల్ చేసే నాని వ్యక్తిగత జీవితానికి కూడా బాగా సమయం కేటాయిస్తారు. ఆయన షేర్ చేసిన పిక్స్ చూస్తేనే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఆయన వ్యక్తిగత జీవితంలో చాలా ముఖ్యమైన జీవిత భాగస్వామి అంజనతో మన హీరో లవ్ స్టోరీ ఎలా మొదలైందో తెలుసా?  

బెస్ట్ ఫ్రెండ్స్ గా ప్రారంభమైన నాని, అంజనా ప్రస్తుతం 8 సంవత్సరాల వైవాహిక ఆనందాన్ని అనుభవిస్తున్నారు. వారి ప్రేమకథ ఒక రకంగా సూపర్. నాని వైజాగ్ లో ఆర్జేగా పని చేస్తున్నప్పుడు అంజనను కలుసుకున్నాడు. ఆమెను చూసి ప్రేమలో పడిన నాని ఆ విషయాన్ని చెప్పేశాడు కూడా. వారు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి దాదాపు ఐదేళ్ల సమయం తీసుకున్నారు. ఆ డేటింగ్ అనంతరం 2012 అక్టోబర్ 27న పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. ఈ జంట 2017లో అర్జున్ ను జన్మనిచ్చారు. వారు తమ కొడుకును ముద్దుగా జున్ను అని పిలుస్తారు. మధ్యలో శ్రీరెడ్డి నానిపై సంచలన ఆరోపణలు చేసినప్పటికి అంజన వాటిని కొట్టిపారేసింది. మధ్యలో వచ్చిన మూడవ వ్యక్తి వల్ల వారి బంధం ఏమాత్రం చెక్కు చెదరలేదు. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు వారి మధ్య ఎంతటి బలమైన ప్రేమ ఉందో అనే విషయం. ప్రస్తుతం నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: