టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మెగా హీరో గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన స్టైల్ ను ఏర్పరుచుకున్నాడు అల్లు అర్జున్.  ఇప్పటి వరకు మెగా అభిమానులను అలరించే సినిమాలు ఎన్నో చేయగా ఆయన వాటి ద్వారా భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను కూడా అందుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి నటించిన విజేత సినిమా ద్వారా సినిమాల్లోకి వచ్చిన బన్నీ గంగోత్రి సినిమా తో హీరోగా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు  ఆ తరువాత ఆర్య సినిమాతో భారీ హిట్ ను కెరీర్ మొదట్లోనే సంపాదించుకుని స్టార్ మెటీరియల్ అని తనని తాను నిరూపించుకున్నాడు.

 ప్రేమకథా చిత్రాలను, క్లాస్ చిత్రాలను, కుటుంబ కథా చిత్రాలను, మాస్ చిత్రాలను సైతం తెరకెక్కించి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. అలాంటి అల్లు అర్జున్ కొన్ని కొన్ని సార్లు తన సినిమాల ఎంపికలో పొరపాట్లు చేసి భారీ ఫ్లాప్ ల ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ విధంగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన పరుగు సినిమా తర్వాత ఆయన కెరియర్ కొంత డౌన్ అయ్యింది.  ఆర్య సినిమాకు కొనసాగింపుగా వచ్చిన ఆర్య 2 చిత్రం యావరేజ్ గా మిగలగా ఆ తరువాత వరుడు వేదం బద్రీనాథ్ చిత్రాలు అల్లు అర్జున్ కి నిరాశనే మిగిల్చాయి.

 వేదం సినిమా పరవాలేదు అనిపించుకున్న ఈ రెండు చిత్రాలు మాత్రం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి పీడకలలు గా మిగిలిపోయాయి అని చెప్పవచ్చు. వీటి తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేసిన జులాయి సినిమా పెద్ద హిట్ ను సంపాదించి పెట్టడమే కాకుండా మంచి పేరు కూడా తీసుకు వచ్చి ఆయనను హీరోగా స్టార్ గా నిలబెట్టిన సినిమా అయ్యింది. మెదడుకు పని చెప్పే విధంగా ఈ సినిమా స్క్రీన్ ప్లే ఉంటుంది. ఎవరూ ఊహించని లాజిక్ లను ఉపయోగించి త్రివిక్రమ్ ఈ స్క్రీన్ ప్లే ను పగడ్బందీగా తయారు చేసుకోగా దానికి తగ్గట్లుగా అల్లు అర్జున్ ఎంతో స్టైలిష్ గా ఈ సినిమాలో నటించి హిట్ అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: