బాలీవుడ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలా వేగంగా పెరుగుతున్న నటులలో ఒకరు ఆయుష్మాన్ ఖురానా ఒకరు. ఆయుష్మాన్ మంచి నటుడు మాత్రమే కాదు గొప్ప గాయకుడు, టీవీ హోస్ట్ కూడా. "విక్కీ డోనర్" సినిమాతో తన కెరీర్ ప్రారంభించిన ఆయుష్మాన్ ఒకదాని తర్వాత ఒకటి హిట్ సినిమాలను ఇస్తూ దూసుకెళ్తున్నారు. అలాగే ఆయన సంపాదన కూడా. ఆయుష్మాన్ నెల, ఏడాది జీతం, అలాగే ఆయన ఆస్తి మొత్తం విలువ కూడా పెరగడానికి నటనలో తాను కనబరిచే ట్యాలెంట్ కారణం.

ప్రస్తుతం బీ టౌన్ లో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఆయుష్మాన్ ఒకరు. ఈ హీరో మొత్తం ఆస్తి విలువ 43 కోట్లు. ఆయుష్మాన్ నెల జీతం 50 లక్షలకు పైగా, సంవత్సరం వేతనం 6 కోట్ల కంటే ఎక్కువగా వస్తోంది. 2013, 2019 సంవత్సరాలలో ఆయుష్మాన్ పేరు ఫోర్బ్స్ భారతీయ సెలబ్రిటీల జాబితాలో నిలిచింది.

ఆయుష్మాన్ ముంబైలో 4000 చదరపు అడుగుల విలాసవంతమైన ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. దాని కోసం అతను నెలకు 5.25 లక్షలు రెంట్ రూపంలో చెల్లిస్తాడు. ఈ ఇంట్లో 7 బెడ్‌రూమ్‌లు ఉన్నాయి. ఇది కాకుండా ఆయుష్మాన్ కు ముంబై, చండీగఢ్‌లో ఇళ్ళు ఉన్నాయి.

ఆయుష్మాన్ వద్ద మంచి లగ్జరీ వాహనాల సేకరణ ఉంది. అతను ఆడి A6, bmw 5 సిరీస్ కార్, మెర్సిడెస్ బెంజ్ S క్లాస్ వంటి వాహనాలను కొని పెట్టుకున్నాడు తన గ్యారేజ్ లో. ఇంకా ఆయుష్మాన్ బీమా, మ్యూచువల్ ఫండ్ లలో కూడా పెట్టుబడి పెట్టారు.

ఇక సినిమాల విషయానికొస్తే ఆయుష్మాన్ ఒక సినిమా కోసం 3 నుంచి 4 కోట్లు వసూలు చేస్తాడు. అదే సమయంలో ఆయుష్మాన్ బ్రాండ్ ఎండార్స్‌మెంట్ కోసం కోటి రూపాయలు వసూలు చేస్తాడు. మరోవైపు టీవీ షోలలో ఒక ఎపిసోడ్ కోసం ఆయుష్మాన్ భారీ మొత్తాన్ని తీసుకుంటాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: