దర్శకుడిగా వరుస సక్సెస్ లు సాధిస్తూ మంచి జోష్ లో ఉన్నాడు అనిల్ రావిపూడి. ఆయన తొలి సినిమా పటాస్ దగ్గర్నుంచి మొన్న విడుదలైన ఎఫ్3 సినిమా వరకు అన్ని సినిమాల్లోనూ కామెడీ ప్రధానంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించి భారీ స్థాయిలో విజయాలను అందుకున్నారు. ఈ విధంగా తెలుగులో ఇప్పుడు అగ్ర దర్శకుడిగా ఎదిగిన అనిల్ రావిపూడి ఇప్పుడు తదుపరి చేయబోయే సినిమా పై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

నందమూరి బాలకృష్ణ తో కలసి ఆయన తన తొలి సినిమా చేయబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపించగా అది నిజం చేస్తూ ఈ చిత్రం ఇటీవలే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చేసింది. బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించగా అప్పటినుంచి అనిల్ రావిపూడి బాలకృష్ణతో ఏ విధమైన సినిమా చేస్తాడో అన్న అంచనాలను నందమూరి అభిమానులు వ్యక్తపరుస్తున్నారు.

నందమూరి బాలకృష్ణ అంటే ఫ్యాక్షన్ యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు అలాంటి హీరో తో రెగ్యులర్ గా తాను చేసే హాస్యభరితమైన యాక్షన్ ఎంటర్టైనర్ సినిమానే అనిల్ రావిపూడి చేస్తాడా లేదా తన పంథాను మార్చుకుని మాస్ మసాలా సినిమాలు చేస్తాడా అనేది చూడాలి. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ రెండిటినీ కలిపి యాక్షన్ ఎంటర్ టైనర్ ను అనిల్ రావిపూడి చేయబోతున్నాడని అంటున్నారు. వాస్తవానికి అలాంటి హాస్యభరితమైన యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో బాలకృష్ణ నటించి చాలా రోజులు అయిపోయింది. ఈ నేపథ్యంలోనే అలాంటి సినిమాల్లో ఆయన చేస్తే చూడాలని కోరుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ తరహా లో ఈ సినిమాలు చేస్తూ ఉండటం వారందరిలో ఎంతో సంతోషాన్ని నెలకొల్పుతుంది. తమ అభిమాన హీరో కొత్త రకమైన పాత్ర చేయడం అభిమానులకు ఎప్పుడు ఇష్టమే కదా. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: