ఆంధ్ర ప్రదేశ్ దివంగత మహానేత శ్రీ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జీవిత చరిత్ర ని ఆధారంగా తీసుకొని మహి.వీ.రాఘవ్ అనే నూతన దర్శకుడు తీసిన యాత్ర సినిమా అప్పట్లో ఎంత పెద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికి తెలిసిందే..YSR గారి రాజకీయ ప్రస్థానం అనేది పాదయాత్ర దగ్గరనుండి ముఖ్య మంత్రి అయ్యేవరకు ఎలా కొనసాగింది..మహానాయకుడిగా ఆయన ఎలా ఎదిగాడు అనేది ఈ సినిమాలో కళ్ళకి కట్టినట్టు చూపించాడు ఆ చిత్ర దర్శకుడు రాఘవ్..మలయాళం సీనియర్ స్టార్ హీరో మమ్ముటి ఇందులో ysr పాత్రని పోషించాడు..చాలా అద్భుతంగా నటించి ysr గారే వెండితెర మీద కనిపించారా అనే విధంగా ఆయన ఆ పాత్రలో ఆయన ఇమిడిపోయారు..ఇక అందుకే ఆ సినిమా అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది..అప్పట్లో ఈ సినిమా దాదాపు 20 కోట్ల రూపాయిల షేర్ ని పైగానే వసూలు చేసింది అంటే మాములు కాదు అనే చెప్పాలి..ఈ సినిమా పెద్ద హిట్ అవ్వగానే యాత్ర 2 జగన్ మోహన్ రెడ్డి గారి మీద తీస్తున్నాం అంటూ ఆ సినిమా రన్నింగ్ లో ఉన్న సమయం లోనే ప్రకటించాడు ఆ చిత్ర దర్శకుడు రాఘవ్.అయితే ఈ యాత్ర 2 సినిమా గురించి ప్రకటన అయితే చేసారు కానీ ఇప్పటి వరుకు కూడా ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది లేదు..కానీ ఇప్పుడు మళ్ళీ ఈ యాత్ర 2 సినిమా టాపిక్ వచ్చింది..


అసలు విషయానికి వస్తే మలయాళం స్టార్ హీరో అయిన దుల్కర్ సల్మాన్ హీరో గా నటించిన సీతారామం సినిమా ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ ని తెచ్చుకొని అద్భుతమైన వసూళ్లను కూడా రాబడుతుంది..ఇక ఈ సినిమా ప్రొమోషన్స్ సమయంలో దుల్కర్ సల్మాన్ ని యాంకర్ ఒక ప్రశ్న అడుగుతూ 'మీ నాన్న గారు తెలుగు లో ysr బయోపిక్ యాత్ర చేసారు..అది పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది..అది మీకు కూడా తెలుసు..ఆ చిత్ర దర్శకుడు జగన్ మోహన్ రెడ్డి గారి బయోపిక్ తో యాత్ర 2 చేస్తాను అని ప్రకటించాడు..జగన్ గారి పాత్ర ని మీరు చేస్తే చాలా బాగుంటుంది అని అభిమానులు అనుకుంటున్నారు..మీరు చేస్తారా' అని అడిగిన ప్రశ్నకి దుల్కర్ సమాధానం చెప్తూ 'నాకు స్క్రిప్ట్ నచ్చితే తప్పకుండ చేస్తాను..నాకు స్క్రిప్ట్ ముఖ్యం..మా నాన్న గారు నటించిన యాత్ర సినిమా పెద్ద హిట్ అని నాకు కూడా తెలుసు..అలాంటి సినిమాకి సీక్వెల్ అంటే కచ్చితంగా చాలా భారీ అంచనాలు ఉంటాయి..ఆ అంచనాలకు తగట్టు గాను సినిమా స్క్రిప్ట్ సిద్ధం చేసి నా దగ్గరకి తీసుకొస్తే ఖచ్చితంగా నేను చెయ్యడానికి రెడీ' అంటూ దుల్కర్ సల్మాన్ మాట్లాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: