నాగార్జున ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. నాగార్జున నటించిన గత చిత్రాలు కూడా బాగానే ఆకట్టుకున్నాయి దీంతో ప్రస్తుతం ది ఘోస్ట్ సినిమాని ఈ రోజున ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం జరుగుతొంది. ఈ చిత్రం కూడా పరవాలేదు అనిపించుకున్నట్లుగా ఉందని అభిమానులు సినీ ప్రేక్షకులు తెలియజేస్తున్నారు. ఈ సినిమాని డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తేరకేకిస్తూ ఉన్నారు. ఇక ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సంయుక్తంగా సునీల్ నారాయణ నిర్మించారు. నాగార్జునకు జోడీగా సోనాల్ చౌహన్ నటించినది. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ట్రైలర్ ప్రేయర్ సైకిల్ నుంచి స్పందన లభించింది. దీంతో ఈ సినిమా పైన భారీగానే అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా సక్సెస్ కావాలి అంటే ఎంత రాబట్టాలో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.


1). నైజాం-5 .59 కోట్ల రూపాయలు.
2). సిడెడ్-2.50 కోట్ల రూపాయలు.
3). ఉత్తరాంధ్ర-2.25 కోట్ల రూపాయలు.
4). ఈస్ట్-1.50 కోట్ల రూపాయలు.
5). వెస్ట్-1.40 కోట్ల రూపాయలు.
6). గుంటూరు-1.60 కోట్ల రూపాయలు
7). కృష్ణ-1.40 కోట్ల రూపాయలు.
8). నెల్లూరు-65  లక్షలు.
9). ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం బిజినెస్ విషయానికి వస్తే.. రూ .16.80 కోట్ల రూపాయలు
10). రెస్ట్ ఆఫ్ ఇండియా-4 కోట్ల రూపాయలు.
11). ఓవర్సీస్-2  కోట్ల రూపాయలు.
12). ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే రూ. 22.80  కోట్ల రూపాయలు జరిగినట్లుగా తెలుస్తున్నది.


ది ఘోస్ట్ సినిమా తెలుగులో మాత్రమే రూ.22.8 కోట్ల రూపాయల థియెట్రికల్ బిజినెస్ జరగగా బాలీవుడ్లో ఇంకా విచిత్రం విడుదలను వాయిదా వేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి అయితే తమిళంలో కూడా ఈ సినిమా భారీగానే రిలీజ్ అవుతున్నది మీకు అందుకు సంబంధించి విషయాలు మాత్రం ఇంకా బయటికి రాలేదు.అయితే ఈ చిత్రం సక్సెస్ కావాలి అంటే కేవలం రూ.23 కోట్ల రూపాయలను రాబట్టాల్సి ఉంటుంది. అయితే ఇది పెద్ద విషయమేం కాదు కానీ ఇప్పుడున్న గట్టి పోటీలు ఏ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుంటుందో చెప్పలేము. కాబట్టి మొదటి రోజు కలెక్షన్లను బట్టి ఏ చిత్రం ఎంత రాబడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: