బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. షారుఖ్ ఖాన్ ఇప్పటికే తాను నటించిన మూవీ ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన  క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం షారుక్ ఖాన్ "జవాన్" అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ కి తమిళ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి అట్లీ దర్శకత్వం వహిస్తూ ఉండగా  లేడీ సూపర్ స్టార్ నయన తారమూవీ లో షారుక్ ఖాన్ సరసన హీరోయిన్ గా కనిపించబోతుంది. అలాగే ఈ మూవీలో మరో ముఖ్యమైన పాత్రలో ప్రియమణి , విజయ్ సేతుపతి కూడా కనిపించబోతున్నారు. ఈ మూవీ కి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

మూవీ ని షారుక్ ఖాన్ తన సొంత బ్యానర్ అయినటువంటి రెడ్ చిల్లీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ఈ మూవీ పై అటు బాలీవుడ్ ఇటు కోలీవుడ్ ఇండస్ట్రీ లలోనూ భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా షారుఖ్ ఖాన్మూవీ షూటింగ్ గురించి సోషల్ మీడియా వేదికగా ఒక అప్డేట్ ఇచ్చాడు. 30 రోజుల పాటు జ‌రిగిన జవాన్  షెడ్యూల్‌ లో చిత్ర యూనిట్‌ తో తాను ఎలా ఆస్వాదించాననే విష‌యాన్ని అభిమానుల‌తో షారుక్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. త‌లైవా ర‌జ‌నీ కాంత్‌ , తల‌ప‌తి విజ‌య్ త‌మ జవాన్ మూవీ సెట్స్ ను సంద‌ర్శించిన విష‌యాన్ని షారుక్ ఖాన్ తాజాగా సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్, యోగి బాబు తదితరులు ఈ మూవీలో ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: