
కేవలం ఐటెం సాంగ్ ల మూలముగానే ఈమెకు అమితమైన పాపులారిటీ ఏర్పడింది. ఊర్వశికి ఇంస్టాలో 60 మిలియన్ల ఫాలోయర్ లు ఉండడం గమనార్హం. ముఖ్యంగా టాలీవుడ్ లో ఊర్వశి "బ్లాక్ రోజ్" సినిమాలో చేసిన "నా తప్పు ఏమున్నదబ్బా..." ఐటెం సాంగ్ ఎంతలా హిట్ అయిందో మనకు తెలిసిందే. ఇప్పటికీ ఈ సాంగ్ తో సోషల్ మీడియాలో పలు రకాల రీల్స్ ఈమె స్థాయిని మరింత పెంచాయి. ఇదే పాపులారిటీతో ఈమెకు టాలీవుడ్ లో వరుస ఆఫర్లు వస్తున్నాయి. అధికారికంగా ఇప్పటి వరకు ప్రకటించిన సమాచారం ప్రకారం బోయపాటి శ్రీను మరియు రామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేయనుంది. బాబీ మరియు చిరంజీవి కాంబోలో వస్తున్న వాల్తేరు వీరయ్య లోనూ ఒక పాటకు ఆడిపాడనుంది.
అయితే టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న ప్రత్యేక సమాచారం మేరకు ఈమెను విజయదేవరకొండ మరియు సమంతలు నటిస్తున్న ఖుషి సినిమాలో ఒక ఐటెం సాంగ్ కు సంప్రదించారట డైరెక్టర్ శివ నిర్వాణం టీం. ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే ఒక ఆసక్తికర సన్నివేశం సందర్భంలో ఈ పాటను కంపోజ్ చేయనున్నారట. అయితే ఈ వార్త ప్రస్తుతానికి ఒక గాసిప్ లానే ఉంది. త్వరలోనే దీని గురించి అధికారిక సమాచారం రానుంది.