టాలీవుడ్  లెజెండ్  సీనియర్ మాస్ హీరో సూపర్ స్టార్ కృష్ణ  గారు ఇకలేరు. ఈరోజు తెల్లవారుఝామున 4 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో 80 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశారు.ఇండియన్  సినిమా ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కృష్ణ గారు గుండెపోటు రావడంతో ఆదివారం గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.అయితే కృష్ణ గారి ఆరోగ్య పరిస్థితి తీవ్రతరంగా ఉండడంతో వైద్యులు  వెండి లెటర్ పై ఉంచి చికిత్స అందించారు. ఈ విధంగా ఈయన ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని తెలియడంతో అభిమానుల ఆందోళన చెందారు. ఇక వైద్యులు కూడా 24 గంటలు గడిస్తే గాని ఏ విషయం చెప్పలేమని చెప్పారు.ఇకపోతే ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు కృష్ణ గారికి తీవ్రమైన అస్వస్థత చేయడంతో ఈయన తుది శ్వాస విడిచారు.


ఇలా లెజెండ్  సూపర్ స్టార్ కృష్ణ  మరణించడంతో ఆయన కుటుంబ సభ్యులు ఎంతో శోకసంద్రంలో మునిగిపోయారు. కృష్ణ ఆస్పత్రిలో చేరుకున్నారని తెలియగానే ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబ సభ్యులతో పాటు ఆయన కూతుర్లు అల్లుళ్ళు మనవళ్ళు మనవరాలు అందరూ కూడా ఆసుపత్రి వద్దా ఉన్నారు.ఆయన తుది శ్వాస విడిచారనీ తెలియగానే ఒకసారిగా సినీ ప్రపంచం ఇంకా అభిమాన లోకం అంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.1942 వ సంవత్సరంలో జన్మించిన కృష్ణ గారు 1965 వ సంవత్సరంలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఇంకా తెలుగు చిత్ర పరిశ్రమలకు ఎన్నో సేవలందించి సూపర్ స్టార్ కృష్ణగా పేరుపొందారు. ఇక చిత్ర పరిశ్రమ గర్వపడే  ఎన్నో అద్భుతమైన సినిమాలను అందించారు. దర్శకుడిగా,నిర్మాతగా, నటుడిగా ఇండస్ట్రీకి ఎన్నో సేవలు చేసిన కృష్ణ గారి మరణం ఇండస్ట్రీకి తీరనిలోటు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: