విశ్వ సుందరి మనుషా చిల్లర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విశ్వ సుందరి విజేతగా నిలిచిన మనుషా చిల్లర్ ఆ తర్వాత సినిమా రంగం లోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో భాగంగా తాజాగా ఈ ముద్దు గుమ్మ అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన సామ్రాట్ పృథ్వీరాజ్ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ హిందీ తో పాటు తెలుగు లో కూడా మంచి అంచనాల నడుమ విడుదల అయింది. ఇది ఇలా ఉంటే మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించ లేక పోయింది.

అయినప్పటికీ మనుషా చిల్లర్ కు మాత్రం ఈ మూవీ ద్వారా దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే మనిషి చిల్లర్ , వరుణ్ తేజ్ మూవీ లో కూడా హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది అని గత కొన్ని రోజులుగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వార్త కనుక నిజం అయితే ఈ ముద్దు గుమ్మ తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గర అయ్యే అవకాశం ఉంది. ఇది ఇలా ఉంటే మాజీ మిస్ వరల్డ్ మరియు నటి అయినటు వంటి మనుషా చిల్లర్ ప్రస్తుతం ప్రముఖ వ్యాపార వేత్త నిఖిల్ కామత్ తో డేటింగ్ చేస్తుంది అని ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

2021 వ సంవత్సరం నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు , అలాగే వీరిద్దరూ కలిసి తరచూ విహారయాత్రలకు వెళుతున్నట్లు తెలుస్తోంది. అలాగే వీరిద్దరి ప్రేమ వ్యవహారం వీరి కుటుంబాలకు కూడా తెలుసంట. ఇది ఇలా ఉంటే నిఖిల్ కు ఇది వరకే పెళ్లయింది. అమండా పురవంకను 2019 వ సంవత్సరంలో నిఖిల్ పెళ్లి చేసుకున్నాడు. గతాడాదే నిఖిల్ విడాకులు తీసుకున్నాడు. ఇప్పుడు నిఖిల్ తో మనుషా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: