యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమాకి సంబంధించి ప్రతిరోజు ఏదో ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వస్తూనే ఉంటాయి. ఈ వార్తల గురించి ఎన్టీఆర్ 30 మేకల్స్ నుంచి కనీసం ఎలాంటి స్పందన లేదు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే ప్రశ్న అందరిలోనూ ఉంది .ఇక సైలెంట్ గా ఉన్నప్పటికీ...  ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన పనులు మొదలై వేగంగా ఆ పనులు జరుగుతున్నాయి... తాజాగా హైదరాబాదులో యువ సుధా ఆఫీస్ లో మొదలైంది. ఇక 2023 సంక్రాంతి తరువాత ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్లో మూవీ రెగ్యులర్ షూట్ ప్రారంభించనున్నారు. సక్సెస్ఫుల్ డిస్ట్రిబ్యూటర్ గా పేరు సంపాదించుకున్న మిక్కిలినేని సుధాకర్..

 ఈ సినిమాతో నిర్మాతగా కెరియర్ను మొదలుపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ తో కలిసి సుధాకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ 30వ సినిమా సక్సెస్ సాధిస్తే కొరటాల శివ తర్వాత సినిమాలకు కూడా సుధాకర్ నిర్మాతగా కెరియర్ను కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఎన్టీఆర్ 30వ సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాతో యువసేన ఆర్ట్స్ బ్యానర్ పేరు దేశవ్యాప్తంగా వినిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ 30వ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది .కాగా ఈ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించగా..

సినిమా సక్సెస్ సాధిస్తే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఆఫర్లతో బిజీ అవుతాడు అనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి .ఈ సినిమా రికార్డులు బ్రేక్ చేయడం గ్యారెంటీ అనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి. 2023 దసరా కానుకగా ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది .త్వరలోనే ఈ సినిమా టైటిల్ కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుంది అని సమాచారం. ఎన్టీఆర్సినిమా స్క్రిప్ట్ విషయంలో చాలా సంతోషంగా ఉన్నారు అని తెలుస్తుంది. దీంతో ఎన్టీఆర్ 30 షూటింగ్ కి సంబంధించిన వార్త కాస్త ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ని సంతోషపరుస్తుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: