ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారికి సంబంధించిన ఏ విషయం బయటకు వచ్చినా కూడా అది హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే కొన్ని కొన్ని సార్లు సినిమా అప్డేట్స్ కు సంబంధించిన విషయాలే కాదు ఇక ఓల్డ్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.  ఇక ఇలాంటివి అభిమానుల దృష్టిని తెగ ఆకర్షిస్తూ ఇంటర్నెట్ ను షేక్ చేస్తూ ఉంటాయి అని చెప్పాలి.


 ఇక ఇప్పుడు ఒక స్టార్ హీరో కి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయ్.  ఇక ఈ ఫోటోలో భాగంగా హీరో సిద్ధార్థ పక్కన ఒక యువకుడు కూర్చుని ఉన్నాడు. ఎంతో అమాయకమైన చూపులతో కనిపిస్తున్నాడు. అయితే ఇలా ఎంతో అమాయకంగా కనిపిస్తున్న ఆ యువకుడు ఇక ఇప్పుడు స్టార్ హీరో.. తమిళంలో హీరో అయినప్పటికీ అటు తెలుగులో కూడా సినిమాలతో ఊహించని రీతిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. 2007 లో హీరోగా కెరియర్ మొదలుపెట్టి ఇప్పటివరకు 23 సినిమాల వరకు నటించాడు.


 విభిన్నమైన కథనం తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో మీరు గుర్తుపట్టే ఉంటారు.. అతను ఎవరో కాదు ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీ లో స్టార్ గా కొనసాగుతున్న హీరో సూర్య తమ్ముడు కార్తీ. ఇక కార్తి మొట్టమొదట ఒక జూనియర్ ఆర్టిస్టుగా నటించాడు. మణిరత్నం దర్శకత్వం లో 2004లో వచ్చిన యువ సినిమా లో సిద్ధార్థ్ స్నేహితుడు పాత్ర లో కనిపించాడు. ఆ సమయం లో కార్తీక లావుగా ఉన్నాడు అని చెప్పాలి. ఇక తర్వాత మరో మూడేళ్లకే అంటే 2007లో హీరోగా అరంగేట్రం చేసి ఇక తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా హీరో సిద్ధార్థ కంటే స్టార్ హీరోగా ఎదిగాడు కార్తీ.

మరింత సమాచారం తెలుసుకోండి: