ఇక సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘బుట్టబొమ్మ’.శౌరీ చంద్రశేఖర్ టి రమేష్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.తమిళ యంగ్ బ్యూటీ అనిఖా సురేంద్రన్, తమిళ యంగ్ హీరో అర్జున్ దాస్, సూర్య వశిష్ఠ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఈ నెల 26 వ తేదీన ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రాబోతుంది. దీంతో మూవీ యూనిట్ ఈ మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టింది.ఈ క్రమంలో నిర్మాత నాగవంశీ ఇంకా అనిఖా సురేంద్రన్.. యాంకర్ సుమకు ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో నాగవంశీ SSMB28 గురించి ఫ్యాన్స్ కి సూపర్ అప్డేట్ ఇచ్చాడు. మహేష్ బాబు గారి సినిమా గురించి ఫ్యాన్స్ కి ఏమన్నా అప్డేట్ ఇవ్వచ్చు కదా అని యాంకర్ సుమ అడగగా దీనికి బదులిస్తూ.. ‘SSMB28 రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 18 వ తేదీ నుంచి మొదలు కానుంది.


ఈ సంవత్సరం ఆగష్టు 11న సినిమాని విడుదల చేస్తాం’ అంటూ రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేసేశాడు ఈ యంగ్ డైరెక్టర్ నాగవంశీ.ఇంకా అలాగే సినిమాలో హీరోయిన్స్ ఎవరో కూడా తెలియజేశాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్దే చేస్తున్న విషయం తెలిసిందే. మేము ప్రకటించకుండానే సెకండ్ హీరోయిన్ గా ‘శ్రీలీల’ని తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. మళ్ళీ ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అవి ఏవి నిజం కాదు. ఈ సినిమా కోసం శ్రీలీలని తీసుకున్న విషయం నిజమే కానీ ఆమె తప్పుకుంది అనే వార్త అబద్ధం. ఈ సినిమాలో ఆమె మరో హీరోయిన్ గా చేస్తున్న విషయం నిజమే కానీ ఆమె సెకండ్ హీరోయిన్ అనేది కూడా అబద్ధం. అని చెప్పాడు.సో ఈ మూవీలో ఇద్దరి హీరోయిన్ లకు సమానమైన ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఫస్ట్, సెకండ్ హీరోయిన్లు అనే తేడా లేదు. ఇద్దరు మహేష్ బాబు పక్కన ఈక్వల్ గా నటిస్తారని హింట్ ఇచ్చాడు నాగావంశీ.

మరింత సమాచారం తెలుసుకోండి: