టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎప్పటినుండో హీరోగా కొనసాగుతున్న మాస్ మహారాజ రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల ఆయన హీరోగా నటించిన ధమాకా సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరిన సంగతి మన అందరికీ తెలిసిందే. దాని అనంతరం మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో నటించి మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు రవితేజ. ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజ ఒక వైపు  సినిమాలో నటిస్తూనే మరొకవైపు రొటీన్ కి భిన్నంగా కొత్తగా కనిపించాలని భావిస్తున్నాడు. కానీ రవితేజ భావిస్తున్నట్లు

 కొత్తగా కనిపిస్తే ఆయనకి పెద్దగా కలిసి రాదు. ఎందుకంటే ఆటోగ్రాఫ్ సినిమా మొదలుకొని రామారావు ఆన్ డ్యూటీ వరకు తన ఇమేజ్ ని పక్కన పెట్టి కొత్తగా ట్రై చేసినప్పటికీ ఆ సినిమాలు పెద్దగా హిట్ కాలేదు. అయినప్పటికీ ప్రతిసారి మళ్లీ మా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు రవితేజ. అయితే ఇప్పుడు కూడా మరోసారి అలాంటి ఆలోచన చేస్తున్నాడు మాస్ మహారాజ రవితేజ. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇండస్ట్రీలో ప్రయోగాత్మక సినిమాలకు పెట్టింది పేరుగా మారిన యువ దర్శకుడు ప్రశాంత్ వర్మతో కలిసి రవితేజ ఒక సినిమా చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

అ! సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ప్రశాంత్ వర్మ దాని తర్వాత జాంబిరెడ్డి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో తెరకేక్కనున్న హనుమాన్ సినిమాతో ఈయన క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది అని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ సినిమా తర్వాత బాలకృష్ణతో ఓ సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే బాలయ్యతో అనుకున్న ప్రాజెక్టు ఇప్పట్లో పట్టాలెక్కేలా కనిపించకపోవడంతో రవితేజకు ఒక కథ వినిపించినట్లుగా తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ సినిమా అంటేనే చాలా కొత్తగా ఉంటుంది. ఇక ఇలాంటి సరికొత్త యంగ్ డైరెక్టర్ కి రవితేజ ఛాన్స్ ఇస్తాడా ఆయన దర్శకత్వంలో సినిమా చేస్తాడా అన్నది చూడాలి ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: