బాలకృష్ణ ప్రస్తుతం మంచి స్వింగ్ లో వున్నాడు.గత 2021 డిసెంబర్ లో వచ్చిన అఖండ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ సంక్రాంతి పండుగ సందర్బంగా విడుదల అయిన వీరసింహారెడ్డి సినిమాతో కూడా ఒక అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నాడు. నందమూరి అభిమానులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. వీర సింహా రెడ్డి ఇచ్చిన ఊపు తో బాలయ్య వరుస సినిమాలను చేస్తున్నాడు.ప్రస్తుతం బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాను పూర్తి చేసే పనిలో వున్నాడు.సినిమాతో పాటు వేరొక షో ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. ఆ షో ఏదో కాదు అన్ స్టాప్పబుల్ షో. ఈ షో మొదటి సీజన్ అద్భుతం గా సాగింది. రెండో సీజన్ కూడా బాగా సాగుతుంది. ఒక పక్క బాలయ్య సినిమాలు చేస్తూనే షోకు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తున్నారు..

అన్ స్టాపబుల్ షో తో బాలయ్య వ్యాఖ్యాతగా మారిపోయాడు.ఆహా వారు పార్ట్ 2 ను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎందరో స్టార్స్ ను గెస్టులుగా తీసుకు వస్తూ వారి ఫ్యాన్స్ కు మంచి ఎగ్జైట్ మెంట్ కలిగిస్తున్నారు.

మరి తాజాగా ఈ షోకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను కూడా ఆహ్వానించారు.. ఈయన ఎపిసోడ్ కు సంబంధించి ఇప్పటికే పోస్టర్స్ మరియు టీజర్ కూడా ఆహా వారు విడుదల చేయగా వాటికీ అదిరిపోయే స్పందన  వచ్చింది. మరి ఈ ఎపిసోడ్ ఎప్పుడు ప్రసారం అవుతుందా అని పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా బాగా ఎదురు చూస్తున్నారు.. ఈ క్రమంలోనే ఈ ఎపిసోడ్ గురించి అదిరిపోయే అప్డేట్ కూడా బయటకు వచ్చింది.. ఇటీవలే బాహుబలి ప్రభాస్ ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ కు రాగా అదిరిపోయే ఆదరణ లభించింది.. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ను కూడా అదిరిపోయే విధంగా ప్లాన్ చేసినట్టు సమాచారం.ఇప్పటికే భారీ హైప్ తెచ్చుకున్న ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ ఎప్పుడో సమాచారం బయటకు వచ్చింది.. పవన్ ఎపిసోడ్ ఫిబ్రవరి 3న ఆహా యాప్ లో స్ట్రీమింగ్ కు రాబోతున్నట్టు టాక్ నడుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: