తినే ప్రతి బియ్యం గింజ మీద ఎవరి పేరు రాసి ఉంటే ఇక అది వారికే సొంతమవుతుంది అనే ఒక సామెత అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి. అయితే సినిమా ఇండస్ట్రీలో కూడా హీరోల దగ్గరికి వచ్చే కథలపై కూడా వారి పేరు రాసిపెట్టి ఉండాలి అనే విధంగానే కొన్ని కొన్ని సార్లు ఆసక్తికర ఘటనలు జరుగుతూ ఉంటాయి అని చెప్పాలి. ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు ఒక హీరో దగ్గరికి వచ్చిన కథలు ఇక మరో హీరో దగ్గరికి వెళ్లడం.. ఇక ఒక హీరో రిజెక్ట్ చేసిన కథను మరో హీరో చేసి సూపర్ హిట్ కొట్టడం లాంటివి జరుగుతూ ఉంటుంది. ఇక ఇలాంటి ఘటనలు ఇప్పుడు కాదు ఎన్నో దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో జరుగుతూనే వస్తున్నాయి.


 ఇక ఇప్పుడు మరో యంగ్ హీరో విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది అన్నది తెలుస్తుంది. ఒక హీరోతో అనుకున్నా కథను మరో యంగ్ హీరో చేతికి వెళ్ళింది. ఇంతకీ ఆ యువ హీరోలు ఎవరో కాదు శర్వానంద్, విశ్వక్సేన్ ఎన్నో రోజులుగా హిట్ అనే పదానికి దూరమైన శర్వానంద్ గత ఏడాది విడుదలైన ఒకే ఒక జీవితం సినిమాతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేసాడు. ఈ క్రమంలోనే చల్ మోహన్ రంగా ఫ్రేమ్ కృష్ణ చైతన్యతో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి.

 ఇవన్నీ జరిగి ఎన్నో రోజులు గడిచిన ఇప్పటివరకు ఈ సినిమా అప్డేట్ మాత్రం లేదు. అయితే ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి శర్వా  తప్పుకున్నాడని తెలుస్తోంది. కారణాలు ఏంటో తెలియదు కానీ ఇక శర్వానంద్ దగ్గరికి వెళ్లిన కథ ఇక ఇప్పుడు విశ్వక్సేన్ చేతిలోకి వచ్చిందట. ఇప్పటికే కథకు సంబంధించిన చర్చలు ముగిసాయని మరికొన్ని రోజుల్లో అధికారిక ప్రకటన రాబోతుంది అన్నది తెలుస్తుంది. ముందుగా అనుకున్నట్లుగా పీపుల్ మీడియా కాకుండా సితార సంస్థ ఈ సినిమా నిర్మించబోతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: