ప్రస్తుతం తెలుగు మరియు తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతున్నటు వంటి పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ పోయిన సంవత్సరం తెలుగు సినిమాలు అయినటువంటి రాధే శ్యామ్ ... ఆచార్య మూవీ లలో నటించగా ... తమిళ మూవీ అయినటు వంటి బీస్ట్ మూవీ లో కూడా నటించింది. ఈ మూవీ లు భారీ అంచనాల నడుమ విడుదల అయినప్పటికీ ఆ స్థాయి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోలేదు. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ లు భారీ విజయాలను అందుకోకపోయినప్పటికీ పూజ హెగ్డే క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. 

ప్రస్తుతం కూడా పూజా హెగ్డే అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమా అవకాశాలను దక్కించుకుంటుంది. అందులో భాగంగా ప్రస్తుతం ఈ బ్యూటీ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ మహేష్ బాబు కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతుంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అదిరిపోయే రేంజ్ అంచనాలు నెలకొని ఉన్నాయి. 

ఇలా ప్రస్తుతం టాలీవుడ్ ... కోలీవుడ్ ఇండస్ట్రిలలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతున్న పూజా హెగ్డే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అలాగే అప్పుడప్పుడు తనకు సంబంధించిన వెరీ ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా పూజ హెగ్డే రెడ్ కలర్ లో ఉన్న శారీని కట్టుకొని అందుకు తగిన రెడ్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి అదిరిపోయే ట్రెడిషనల్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం పూజా హెగ్డే కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: