ఈ మధ్యకాలంలో బుల్లితెర యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ షేర్ చేసిన ముఖ్యంగా ఆంటీ అని అనడంపై చాలా సీరియస్ అయిందని చెప్పవచ్చు. ఆంటీ అని పిలిస్తే కేసు పెడతానంటూ కూడా కొంతమందికి వార్నింగ్ ఇచ్చింది.దీంతో ఈ విషయం వైరల్ కావడం జరిగింది. ఇక ఆమె మాట కూడా మరింత పాపులర్ అయిందని చెప్పవచ్చు. పెద్ద వయసు ఉన్న పెళ్లయిన మహిళలని ఆంటీ అని సంబోధించడం కామన్ కాదని ఎంతోమంది అనసూయకు సపోర్టు చేశారు.అయితే ఆంటీ అనే మాట వయసు వచ్చిన కుర్రాళ్ళు అంటే మాత్రం కచ్చితంగా అది తప్పే అవుతుందని సీనియర్ హీరోయిన్ కస్తూరి తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగిందిప్రస్తుతం ఇంటింట గృహలక్ష్మి అని సీరియల్స్ లో నటిస్తోంది.అన్నమయ్య సినిమాలో నాగార్జునకు జోడిగా నటించిన కస్తూరి తమిళనాడులో వివాదాస్పద నటిగా ఉందంటూ ఈమె పైన పలు వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఇదంతా ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిన్న పిల్లలు ఆంటీ అని పిలిస్తే అందులో ఎలాంటి తప్పు ఉండదని కానీ ఎద్దుల ఉన్న కుర్రాళ్ళు ఎవరైనా సరే మహిళలని ఆంటీ అని పిలిస్తే ఖచ్చితంగా వారు వేరే భావనతో పిలిచారని అర్థం చేసుకోవాలని తెలుపుతోంది.


హీరోలని ఎవరు కూడా అంకుల్ అని పిలవరు.. కదా మరి హీరోయిన్స్ ఎందుకు అలా పిలుస్తూ ఉంటారని తెలియజేస్తోంది. ఇప్పటికి ఆంటీ అనే పదానికి డర్టీ మీనింగ్ వచ్చేసిందని అలా పిలిస్తే ఖచ్చితంగా అది తప్పే అవుతుందని తెలుపుతోంది కస్తూరి. ఈ విషయంలో అనసూయ కి తన పూర్తి మద్దతు ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసింది. ఇక ఏపీ రాజకీయాలలో తనకు వైయస్సార్ అంటే అభిమానం అని అంతకుమించి ఇక్కడ రాజకీయ వాతావరణం గురించి తనకి పెద్దగా అవగాహన లేదని విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: