ఇండియా వ్యాప్తంగా మంచి నటిగా గుర్తింపును సంపాదించుకున్న వారిలో శోభిత ధోళిపాల ఒకరు. ఇప్పటికే ఈమె ఎన్నో సినిమాలలో నటించి ఇండియా వ్యాప్తంగా మంచి నటిగా గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి నాగ చైతన్య ను ఈమె కొంత కాలం క్రితమే వివాహం చేసుకుంది. ప్రస్తుతం వీరి వివాహ బంధం ఎంతో ఆనందంగా ముందుకు సాగుతుంది. తాజాగా శోభితా కు ఒక అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలో అవకాశం దక్కినట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి ఆర్య హీరో గా రూపొందబోయే సినిమాలో ఈమెకు హీరోయిన్గా అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఒక వేళ శోభిత ధూళిపాల కు గనుక నిజం గానే ఆర్య హీరో గా పా రంజిత్ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరోయిన్గా అవకాశం వచ్చినట్లయితే అది ఆమెకు అద్భుతమైన క్రేజీ ఆఫర్ అవుతుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. కొంత కాలం క్రితం ఆర్య హీరో గా పా రంజిత్ దర్శకత్వంలో సార్పట్టా పరంపర అనే సినిమా వచ్చింది.

సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఈ మూవీ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో విడుదల అయినప్పటికి ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు వచ్చాయి. అలా ఇప్పటికే ఆర్య , పా రంజిత్ కాంబోలో రూపొందిన సార్పట్టా పరంపర మూవీ మంచి ప్రేక్షకాదరణ పొంది ఉండడంతో వీరి కాంబోలో రూపొందిబోయే రెండవ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: