గత కొద్ది రోజుల నుండి అల్లు శిరీష్ పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్త ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. అల్లు శిరీష్ హైదరాబాద్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కూతుర్ని ప్రేమించారని.. కానీ వీరి పెళ్లికి ఇరు కుటుంబసభ్యులు ఒప్పుకున్నప్పటికీ పెళ్లి చేసుకునే సమయంలో అల్లు కనక రత్నమ్మ మరణించడంతో పెళ్లి వాయిదా పడింది అంటూ ఎన్నో రూమర్లు వినిపించాయి. అయితే ఈ వార్త ఎప్పుడు వినిపించే రూమర్ గానే చాలామంది కొట్టి పారేశారు. కానీ తాజాగా అల్లు శిరీష్ తన సోషల్ మీడియా ఖాతాలో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఫొటోస్ ని షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. మరి ఇంతకీ అల్లు శిరీష్ ప్రేమించిన ఆ అమ్మాయి ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. 

అల్లు శిరీష్ తాజాగా ఈఫిల్ టవర్ దగ్గర తన ప్రియురాలు చేతుల్ని పట్టుకుని ఉన్న ఫోటోలు షేర్ చేశారు. తాతయ్య అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా నేను నా మనసుకి దగ్గరైన ఓ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. నేను ఈ మధ్యనే నైనిక అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాను. మా నానమ్మ ఎప్పుడూ నా పెళ్లి చూడాలని ఆసక్తి చూపించేది. కానీ ప్రస్తుతం నా పెళ్లి చూడ్డానికి ఆవిడ లేరు. ఆవిడ మా ముందు లేకపోయినప్పటికీ ఎక్కడ ఉన్నా మా జంటను ఆశీర్వదిస్తుంది. అలాగే మా ప్రేమను ఇరుకుటుంబ సభ్యులు అంగీకరించాయి. ఈ మధ్యనే నైనికతో నా ఎంగేజ్మెంట్ కూడా జరిగింది అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు.

అయితే అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ చేసుకున్న ఆ అమ్మాయి ఫోటోని రివీల్ చేయకపోయినప్పటికీ ఆ అమ్మాయి చేయి పట్టుకున్న ఫోటో మాత్రం పోస్ట్ చేశారు. అందులో ఎంగేజ్మెంట్ రింగు కనిపించేలా ఫోటో ఉంది.దాంతో ఈ జంట పారిస్లో ఇరుకుటుంబ సభ్యుల సమక్షంలో రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు అర్థమవుతుంది. ఇక నైనిక హైదరాబాద్ కి చెందిన అమ్మాయి అయినప్పటికీ ఆమెకు సంబంధించిన డీటెయిల్స్ ఏవి ఇంకా బయటకి రాలేదు.  మరి వీరి పెళ్లి అల్లు కనకరత్నమ్మ సంవత్సరికం అయిపోయాక చేస్తారా..లేక త్వరలోనే పెళ్లి డేట్ కూడా ప్రకటిస్తారా అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: