టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి రెండు సినిమాలే చేసిన కన్నడ భామ శ్రీ లీలకు ఇక్కడ మన వాళ్లు నెంబర్ 1 కిరీటం ఇచ్చేస్తున్నారు. అదేంటి రెండు సినిమాలకేనా అని అనుకోవచ్చు. చేసింది రెండు సినిమాలే కాగా అవి రెండు హిట్ అవడమే కాకుండా ఇప్పుడు అమ్మడి చేతినిండా అరడజను దాకా సినిమాలు ఉన్నాయి. అందుకే అమ్మడు ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ లో టాప్ ప్లేస్ దక్కించుకోవడం పక్కా అని అంటున్నారు. రోషన్ తో పెళ్లిసందడి సినిమాలో నటించిన శ్రీలీల ఈ రేంజ్ పాపులారిటీ తెచ్చుకుంటుందని ఎవరు ఊహించి ఉండరు.

ఇంకా చెప్పాలంటే ఆ సినిమా చేసిన శ్రీకాంత్ తనయుడు రోషన్ మరో సినిమా రిలీజ్ కాలేదు కానీ శ్రీ లీల ఖాతా లో అరడజను సినిమాలు వచ్చి చేరాయి. ఆ సినిమాలు కూడా అలాంటి ఇలాంటి కాంబినేషన్స్ కాదు. అందుకే కచ్చితంగా అమ్మడు నెంబర్ 1 రేసులో ఉండి తీరుతుందని అంటున్నారు. ఓ పక్క కొత్త హీరోయిన్స్ ఎవరు ఈ రేంజ్ ఫాం లో లేకపోవడం ఈమధ్య వచ్చిన భామలు కూడా హిట్లు ఫ్లాపులతో సతమవుతుండటం కూడా శ్రీ లీలకు కలిసి వచ్చింది.

శ్రీ లీల ఛాన్స్ ల వెనక తన కష్టమే కాదు లక్ కూడా ఉందని చెప్పొచ్చు. టాలెంట్ తో పాటుగా లక్ కూడా కలిసి వచ్చి అమ్మడికి ఈ క్రేజ్ తీసుకొచ్చాయి. ముఖ్యంగా వచ్చిన ఛాన్స్ ని అమ్మడు పర్ఫెక్ట్ గా యుటిలైజ్ చేసుకుంటుంది. అందుకే అమ్మడికి అతి తక్కువ టైం లోనే ఈ ఫాలోయింగ్.. ఈ క్రేజ్ వచ్చాయి. రానున్న క్రెజీ సినిమాల్లో ఏ ఒకటి రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ అందుకున్నా శ్రీలీలని అందుకోవడం ఎవరి వల్లా కాదని చెప్పొచ్చు. ఏది ఏమైనా అమ్మడు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన టైం గోల్డెన్ టైం అని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: