సూపర్ స్టార్ రజనీ కాంత్ గురించి ఆయన స్టార్ స్టామినా గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు  ఇప్పటికి ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న రజనీ కాంత్ కేవలం ఇండియాలో మాత్రమే కాకుండా అనేక దేశాల్లో కూడా ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు.

ఇది ఇలా ఉంటే రజినీ కాంత్ ప్రస్తుతం వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో రమ్య కృష్ణ ... రజినీ కాంత్ కు జోడిగా నటిస్తూ ఉండగా ... మిల్కీ బ్యూటీ తమన్ను ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఈ మూవీ పై తమిళ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ తో రజనీ కాంత్ ఏ రేంజ్ విజయన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటాడో చూడాలి.

ఇది ఇలా ఉంటే తాజాగా రజనీ కాంత్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తాజా ఇంటర్వ్యూలో భాగంగా రజనీ కాంత్ తాను ఎందుకు రాజకీయాలకు దూరంగా ఉన్నాను అనే విషయాన్ని చెప్పుకొచ్చాడు  తాజా ఇంటర్వ్యూ లో బాగంగా రజనీ కాంత్ మాట్లాడుతూ ... తాను మూత్ర పిండాల సమస్యతో బాధపడుతుండడం వల్లే రాజకీయాలకు దూరమైనట్టు తాజాగా ఆయన చెప్పారు. తాను ఆ సమస్యకు చికిత్స పొందుతూ రాజకీయాల్లోకి వస్తే తన ఆరోగ్యానికి మంచిది కాదు అని, డాక్టర్ రాజన్ రవిచంద్రన్ తనకు సలహా ఇచ్చారని రజనీ కాంత్ తాజాగా అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: