గతేడాది అనగా 2022 వ సంవత్సరంలో హైయెస్ట్ కలెక్షన్లను సాధించిన సినిమాలలో సౌత్ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన కేజీఎఫ్2  సినిమా ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. ఆర్.ఆర్.ఆర్ సినిమాను మించి కేజీఎఫ్2 సినిమా కలెక్షన్లను సాధించడం సోషల్ మీడియాలో గత సంవత్సరం నుంచి హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.అయితే ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమా మళ్ళీ స్పీడ్ అందుకొని అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకుంది. ఇటీవల విదేశాల్లో విడుదల అయ్యి అక్కడ సాధించిన కలెక్షన్లతో ఈ సినిమా ఈ రేర్ ఫీట్ ను సొంతం చేసుకుంది.కేజీఎఫ్2 లాంగ్ రన్ లో సాధించిన కలెక్షన్లు 1233 కోట్ల రూపాయలు కాగా ఇక ఆర్.ఆర్.ఆర్ సినిమా ఇప్పటివరకు సాధించిన టోటల్ కలెక్షన్లు 1236 కోట్ల రూపాయలు అని సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే జపాన్ లో ఈ సినిమాని డబ్ చేసి రిలీజ్ చేయడం ఇంకా అలాగే కొన్నిరోజుల ముందు ఈ సినిమాను అమెరికాలో రీరిలీజ్ చేయడంతో ఈ సినిమాకు ఈ రేంజ్ వసూళ్లు వచ్చాయి.


పైగా నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డ్ రావడంతో భవిష్యత్తులో ఈ సినిమాను రీరిలీజ్ చేసినా కూడా తిరిగి మంచి వసూళ్లు దక్కే అవకాశం ఉంది.400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు కూడా రికార్డ్ రేటుకు అమ్ముడయ్యాయి. ఎన్నో అంచనాలని దాటుకుని ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం గమనార్హం. చరణ్, తారక్ ఇమేజ్ ఈ సినిమాతో ఏకంగా గ్లోబల్ రేంజ్ కి పెరిగింది.ఈ సినిమా రిజల్ట్ విషయంలో తారక్, చరణ్ ఫ్యాన్స్ అయితే తెగ సంతోషిస్తున్నారు.అందుకే చరణ్, తారక్ తమ తర్వాత సినిమాలు మరింత స్పెషల్ గా ఉండాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. చరణ్, తారక్ మరిన్ని ఇండస్ట్రీ హిట్లను తమ ఖాతాలో వేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆర్.ఆర్.ఆర్ సినిమా రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను సొంతం చేసుకోవాలని కూడా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చరణ్, తారక్ లకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఊహించని స్థాయిలో అభిమానులను పెంచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: