టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హిట్ రుచి చూసి చాలా కాలం అయ్యిందనే చెప్పాలి. వరుస ప్లాపులతో చాలా ఇబ్బంది పడుతున్నాడు. తనతో పాటు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇంకా తనకంటే వెనక వచ్చిన రామ్ చరణ్, నాని, విజయ్ దేవరకొండ, రామ్ వంటి హీరోలు కూడా స్టార్స్ గా దూసుకుపోతున్నారు. కానీ నితిన్ మాత్రం బాగా స్ట్రగుల్ అవుతున్నాడు. ఇక అప్పుడెప్పుడో భీష్మ తో మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత ఆ టైప్ హిట్ అందుకోలేకపోయాడు నితిన్.మధ్యలో వచ్చిన రంగ్ దే సినిమా మంచి టాక్ అందుకున్నా..అది సూపర్ హిట్ గా నిలువలేక పోయింది. దాంతో ఇప్పుడు ఎలాగైన సరే హిట్ కొట్టాలన్న కసి మీద ఉన్నాడు. ఈ క్రమంలోనే మరోసారి భీష్మ టీమ్ తో కలిసి చేతులు కలిపాడు. భీష్మ సినిమాను వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు.


ఈ మూవీలో హీరోయిన్ గా రష్మిక మందన్న  నటించింది. భీష్మ సినిమా రొమాంటిక్ , కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఈ మూవీతో మంచి విజయాన్ని అందుకున్నాడు నితిన్. ఇక ఇప్పుడు మరలా ఈ కాంబో రిపీట్ కానుంది.తాజాగా ఉగాది పండుగ సందర్భంగా ఒక వీడియోను రిలీజ్ చేశారు.ఇక ఈ వీడియోలో నితిన్, రష్మిక, జీవి ప్రకాష్ వెంకీ కుడుములు కనిపించారు. వెంకీ కథ అద్భుతంగా ఉంది అంటే కామెడీ మూవీనా  అని నితిన్, రొమాంటిక్ మూవీనా అని రష్మిక.. లేదా చలో, భీష్మ ల్లా ఉంటుందా అని మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ అడగ్గా.. కాదు ఈ మూవీ నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది అని వెంకీ చెప్తాడు.ఇక ఈ మూవీని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇవ్వనున్నారు. ఈ సినిమాలో నితిన్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడని సమాచారం తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: