టాలీవుడ్ సీనియర్ కమెడియన్ అల్లు రామలింగయ్య మనవుడిగా ఇంకా మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా ఇండస్ట్రీకి పరిచమైన హీరో అల్లు అర్జున్.ఇక ఈ రోజు (ఏప్రిల్ 8) స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన 41వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. అంతేకాదు ఈ ఏడాదితో ఇండస్ట్రీలో కూడా హీరోగా 20 ఏళ్ళ కెరీర్ ని పూర్తి చేసుకుంటున్నాడు అల్లు అర్జున్ . అల్లు అర్జున్ హీరోగా పరిచయం అవ్వడానికి కంటే ముందు పలు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు. తన మావయ్య మెగాస్టార్ చిరంజీవి నటించిన విజేత సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మొదటిసారి వెండితెరకు పరిచయం అయ్యాడు అల్లు అర్జున్.ఇక ఆ తరువాత కమల్ హాసన్ స్వాతిముత్యం సినిమాలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా అల్లు అర్జున్ కనిపించాడు. ఇక 18 ఏళ్ళ వయసులో చిరంజీవి డాడీ సినిమాలో డాన్సర్ గా కనిపించి మెగా ఆడియన్స్ అభిమానాన్ని సొంత చేసుకున్నాడు. ఈ మూడు సినిమాలు తరువాత 2003 వ సంవత్సరంలో గంగోత్రి సినిమాతో హీరోగా డెబ్యూట్ చేశాడు.సీనియర్ స్టార్ డైరెక్టర్ దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇటీవలే ఈ సినిమా విడుదలయ్యి మొత్తం 20 ఏళ్ళు పూర్తి చేసుకుంది. 


అయితే అల్లు అర్జున్ కి మాత్రం మంచి గుర్తింపు తీసుకు వచ్చిన సినిమా అంటే ఆర్య . ఈ సినిమాతోనే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచమయ్యాడు.ఆర్య సినిమా హిట్ అల్లు అర్జున్ కి, సుకుమార్ కి మంచి క్రేజ్ తీసుకొచ్చింది. ఇక మళ్ళీ 2009 లో ఆర్య 2 తో ఆడియన్స్ ముందుకు వచ్చారు.  తన డ్రెస్సింగ్ స్టైల్ తో యూత్ అందరికి రోల్ మోడల్ అయ్యాడు. ఇక అల్లు అర్జున్ కి మాస్ హీరో ఇమేజ్ ని తీసుకు వచ్చిన సినిమా  దేశముదురు. పూరీజగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అల్లు అర్జున్ ని మాస్ ఆడియన్స్ కి దగ్గర చేసింది. తన కెరీర్ లో ప్లాపుల కంటే ఎక్కువగా విజయాలు సాధించిన సినిమాలే ఉన్నాయి.ఇక పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరో అయిపోయాడు. స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ ట్యాగ్ ని సంపాదించుకున్నాడు. ఇప్పుడు పుష్ప ది రూల్ తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని రూల్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇక నిన్న రిలీజ్ చేసిన పుష్ప 2 కాన్సెప్ట్ టీజర్ సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఒకప్పుడు మెగా హీరోగా పిలవబడే బన్నీ ఇప్పుడు తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకోని పెద్ద పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: