రీసెంట్ గా థియేటర్లలో విడుదలైన రావణాసుర మూవీ నెగిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సుధీర్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ట్విస్టులు బాగానే ఉన్నా వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అయితే కాలేదు


రివేంజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా నెటిజన్లకు ఒకింత భారీ షాక్ ఇచ్చిందనే విషయం తెలిసిందే. ఈ సినిమా డిజాస్టర్ కావడానికి ఆ తప్పులే కారణమని కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి. 

రావణాసుర సినిమాలో రవితేజ మార్క్ ఎంటర్టైన్మెంట్ సన్నివేశాలు అయితే అస్సలు లేవు. రవితేజ లాయర్ గా కనిపించినా కథకు ఆ పాత్ర వల్ల పెద్దగా ఉపయోగం కూడా లేకపోవడం ఈ సినిమాకు మైనస్ అయింది. రావణాసుర సినిమాలో ఎక్కువ సంఖ్యలో హీరోయిన్లు ఉన్నా కూడా ఒక్క హీరోయిన్ పాత్ర కూడా సరిగ్గా లేదు. ఆ పాత్రలకు క్రేజ్ ఉన్న హీరోయిన్లను సైతం ఎంపిక చేయాల్సిన అవసరం అయితే లేదని కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి.శృతిమించిన రొమాన్స్ సన్నివేశాలు కూడా ఈ సినిమాకు మైనస్ అయ్యాయని చెప్పాలి.. క్లైమాక్స్ లో హీరో గురించి పాజిటివ్ గా చెప్పించినా ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చని విధంగా కొన్ని సన్నివేశాలు ఈ సినిమాలో ఉండటం విశేషం.దర్శకుడు సుధీర్ వర్మ తన డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రతి సినిమాను అద్భుతమైన థ్రిల్లర్ గా ఒకే జానర్ లో తెరకెక్కించాలని భావించినా కథ, కథనం విషయంలో తప్పటడుగులు వేస్తున్నారని తెలుస్తుంది.. హైపర్ ఆది కామెడీ టైమింగ్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉండగా ఈ సినిమాకు మాత్రం ఆయన కామెడీ కూడా మైనస్ అయింది. ఈ తప్పులు రావణాసుర సినిమాకు మైనస్ అయ్యాయని తెలుస్తుంది.. ఈ సినిమాకు కలెక్షన్లు సైతం అంత అనుకున్న విధంగా లేవు. రవితేజ వేగంగా సినిమాలు చేయడం కంటే కథ, కథనం అద్భుతంగా ఉన్న సినిమాలలో నటిస్తే బాగుంటుందని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: