టాలీవుడ్ లో మెగా బ్రదర్ గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నాగబాబు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇక నాగబాబు కూతురు నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మెగా డాటర్ గా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది నిహారిక. అయితే తాజాగా నిహారిక కు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. మెగా డాటర్ నిహారిక జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా నిహారిక చైతన్యతో విడాకులు తీసుకోబోతోంది అన్న వార్తలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 

అయితే వీరిద్దరి విడాకులకు సంబంధించి ఎన్ని వార్తలు వస్తున్నప్పటికీ ఈ జంట మాత్రం ఇప్పటివరకు ఆ వార్తలపై స్పందించలేదు. అఫీషియల్ గా వీరిద్దరూ విడాకులు తీసుకున్నట్టు చెప్పకపోయినా వారిద్దరి ప్రవర్తన మాత్రం విడాకులు తీసుకోబోతున్నారు అన్నట్లుగానే ఉన్నాయి. ఇప్పటికైతే వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. అంతే కాకుండా వారిద్దరి పెళ్లికి సంబంధించిన ఫోటోలను అలాగే వీడియోలను సైతం డిలీట్ చేయడం జరిగింది. ప్రస్తుతం నిహారిక హైదరాబాదులోని నాగబాబు ఇంట్లోనే ఉంటుంది అన్న వార్తలు సైతం ప్రచారంలోకి వస్తున్నాయి.అయితే ఈ నేపథ్యంలోనే నిహారిక విడాకులు కన్ఫామ్ చేసింది అని మెగా అభిమానులు అంటున్నారు. ఇక ఈ క్రమంలోనే నిహారిక రెండో పెళ్లి కూడా చేసుకోబోతుంది అని తెలుస్తోంది.

ఇక నిహారిక రెండో పెళ్లి చేసుకోబోతుంది అని తెలియగానే చాలామంది నెటిజన్లు ఎవరిని రెండో పెళ్లి చేసుకోబోతుంది అని ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇటీవల విరూపాక్ష సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న సుప్రీం హీరో సాయి ధరంతేజ్ నీ నిహారిక రెండవ పెళ్లి చేసుకోబోతోంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నిహారికకు సాయి ధరమ్ తేజ్ వరుసకు బావ అవుతాడు. అన్ని బావుంటే నిహారిక సాయి ధరమ్ తేజ్ నే పెళ్లి చేసుకుని ఉండేది. కానీ తేజ్ కి మాత్రం నిహారికపై అలాంటి ఒపీనియన్ లేకపోవడంతో వారిద్దరి పెళ్లి జరగలేదు. అనంతరం నిహారిక చైతన్యని పెళ్లి చేసుకుంది. ఈ నేపథ్యంలోనే తేజ్ కి నిహారికని ఇచ్చి పెళ్లి చేస్తే తన కూతురి జీవితం బాగుంటుందని నాగబాబు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడట. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు నాగబాబు గానీ నిహారిక గాని ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.మెగా కుటుంబం నుంచి ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చేవరకు ఇందులో ఎంత నిజముందో తెలియదు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: